మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం

జయభేరి, గజ్వేల్:

గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డుకు చెందిన సంఘనోల్ల రాజు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కళ్యాణ్‌కార్ పద్మాబాయి నర్సింగరావు మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, మానవతా దృక్పథంతో ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రవాడ బాలకృష్ణతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొని రాజు మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

jayabherinews@gmail.com
Written by

[email protected]

↑