11 రూపాయిల ఐవీసెట్  235

జయభేరి, ముంబై,  సెప్టెంబర్ 17 :
రూ. 11 విలువైన ఐవీ సెట్‌ను రూ. 325కి విక్రయిస్తూ దాదాపు 2,800 శాతానికి పైగా లాభం దండుకోవడం.. రూ. 6.75ల సిరంజిలను రూ. 57.20కి విక్రయిస్తూ 747 శాతం మార్జిన్ వేయడం.. రూ. 40 విలువైన నెబ్యులైజర్ మాస్క్‌ను ఏకంగా రూ. 715కి విక్రయించడం.. ఇవన్నీ మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్  పరిధిలోని ‘ప్రైస్ మోనిటరింగ్ రీసోర్స్ యూనిట్’ (నిర్వహించిన మార్కెట్ సర్వేలో వెలుగుచూసిన దిగ్భ్రాంతికర విషయాలు. ఆసుపత్రుల్లో చేరిన రోగుల నుంచి వైద్య పరికరాలు, కన్స్యూమబుల్స్ పేరిట ఏ స్థాయిలో లాభార్జన జరుగుతుందో ఈ నివేదిక స్పష్టం చేసింది.: హర్యానాకు చెందిన మెడిప్లస్ సంస్థ తయారు చేసిన ‘మెడిఫ్యూజన్ ఐవీ సెట్’ కొనుగోలు ధర రూ. 11.05 కాగా, దానికి MRP రూ. 325గా ముద్రించి ఏకంగా 2,841 శాతం మార్జిన్ దండుకుంటున్నారు లైఫ్‌లాంగ్ మెడిటెక్ సంస్థ తయారు చేసిన 10 ml సిరంజీ కొనుగోలు ధర రూ. 6.75 కాగా, దాన్ని రోగులకు రూ. 57.20కి విక్రయిస్తున్నారు.కెన్యులా, మాస్క్‌లు: రూ. 22.50 విలువైన ఐవీ కెన్యులాను రూ. 424కి, అలాగే రూ. 45 విలువైన నెబ్యులైజర్ మాస్క్ కిట్‌ను రూ. 652కి విక్రయిస్తున్నారు.ఇతర పరికరాలు: విన్‌జో హెల్త్‌కేర్, రోమ్‌సన్, రిబ్బెల్ వంటి సంస్థలు తయారు చేసే కథేటర్లు, నీడిల్స్ కొనుగోలు ధర కంటే 10 నుంచి 19 రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడుపోతున్నాయి.ఈ అడ్డగోలు దోపిడీని మహారాష్ట్ర ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారామ్ ముండే తీవ్రంగా ఖండించారు. తయారీదారులు తమ ఉత్పత్తి, రవాణా, మార్కెటింగ్ ఖర్చులు, లాభాలను కలిపిన తర్వాతే ప్రాథమిక కొనుగోలు ధర నిర్ణయమవుతుందని, దానిపై మళ్ల ఇన్ని రెట్లు ధరలు పెంచడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.ఆసుపత్రి అత్యవసర చికిత్సలో ఉండే రోగులకు ఈ పరికరాల ధరలపై బేరమాడే అవకాశం ఉండదని, అందుకే డ్రగ్స్ ఆర్డర్ (DPCO) 2013 పరిధిలోకి ఈ మెడికల్ పరికరాలను తీసుకొచ్చి ధరలపై పరిమితి విధించాలని కోరుతూ కేంద్ర విలేఖర రసాయనాలు, ఫార్మాస్యూటికల్స్ శాఖ కార్యదర్శికి ఆయన లేఖ రాశారు. విధానపరమైన చర్యలు తీసుకోవడం ద్వారానే ప్రజలపై పడుతున్న ఈ తీవ్రమైన ఆర్థిక భారాన్ని తగ్గించవచ్చని స్పష్టం చేశారు.

jayabherinews@gmail.com
Written by

[email protected]