హిందుస్థాన్ కోకాకోలా రూ.1127 కోట్లు పెట్టుబడి

జయభేరి, విజయనగరం, సెప్టెంబర్ 17 :
ఏపీలో హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ భారీ పెట్టుబడి పెట్టబోతోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక కమిటీ ఆమోదం తెలిపినట్లు సమాచారం. మొత్తం రూ.1127 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. . రూ.842 కోట్లతో విజయనగరం జిల్లాలో కొత్త యూనిట్ ఏర్పాటు చేయనున్నారు.. అలాగే తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో విస్తరణ కోసం రూ.285 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్‌‌కు మరో భారీ పెట్టుబడి రాబోతోంది. హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ (హెచ్‌సీసీబీఎల్) విజయనగరం జిల్లాల్లో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.. అలాగే చిత్తూరు జిల్లాలో ప్రస్తుత యూనిట్‌ను విస్తరించనుంది. రాష్ట్రంలో మొత్తం రూ.1,127 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. దేశంలో అతిపెద్ద బాట్లింగ్ భాగస్వామిగా ఉన్న హెచ్‌సీసీబీల్ దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌‌తో పాటుగా తెలంగాణ, తమిళాడు, కర్ణాటకలో కూల్‌డ్రింక్‌ల డిమాండ్‌కు తగిన విధంగా ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అందుకే ఏపీలో రెండు యూనిట్ల ఏర్పాటుకు ప్రతిపాదించగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక కమిటీ ఆమోదం తెలిపినట్లు సమాచారం.హెచ్‌సీసీబీల్ కోకాకోలా రూ.1,199 కోట్ల పెట్టుబడిని ఆంధ్రప్రదేశ్ నుంచి ఉపసంహరించుకుందని గతంలో వైఎస్సార్‌సీపీ ఆరోపణలు చేసింది.. అధికార కూటమి పార్టీలు ఈ విమర్శలకు కౌంటర్ ఇచ్చాయి. వాస్తవానికి కోకాకోలా కంపెనీలో జరిగిన కొన్ని మార్పుల కారణంగా విస్తరణ ప్రణాళిక వాయిదా పడిందని తెలుస్తోంది. తాజాగా రూ.1,199 కోట్ల పెట్టుబడితో కొత్త యూనిట్ ప్రారంభించడంతో పాటుగా.. మరో యూనిట్‌ను విస్తరించేందుకు సిద్ధమైంది. విజయనగరం జిల్లాలో కొత్త యూనిట్ కోసం రూ.842 కోట్లు.. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిలో విస్తరణ కోసం రూ.285 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.విజయనగరంలోని తయారీ యూనిట్‌లో ఏడాదికి 18 మిలియన్ కేసుల సామర్థ్యంతో మూడు బాట్లింగ్ లైన్లు ఏర్పాటు చేయనున్నారు. పెద్ద, చిన్న ప్యాక్ సైజులలో కార్బోనేటెడ్ కూల్ డ్రింక్‌ల కోసం రెండు బాట్లింగ్ లైన్లు.. జ్యూస్ లైన్, టెట్రా ప్యాక్‌ల కోసం మరో బాట్లింగ్ లైన్ ఉంటాయి. రెండవ దశలో కంపెనీ ఏడాదికి 12 మిలియన్ కేసుల సామర్థ్యంతో రెండు బాట్లింగ్ లైన్లను ఏర్పాటు చేస్తుంది. చిత్తూరు జిల్లాలో ఒక ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాట్లింగ్ లైన్, రెండు కార్బోనేటెడ్ కూల్ డ్రింక్ బాట్లింగ్ లైన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే విస్తరించిన ప్లాంట్‌లో కోకా-కోలా, థమ్స్ అప్, స్రైట్, ఫాంటా, లిమ్కా, కిన్లీ వాటర్ ఆరు బ్రాండ్‌లను తయారు చేస్తున్నారు. కొత్తగా విస్తరించనున్న ప్లాంట్ కోసం అదనంగా భూసేకరణ చేయరు.. ప్రస్తుతం ఉన్న ప్లాంట్ ప్రాంగణంలోనే విస్తరించనున్నారు.

jayabherinews@gmail.com
Written by

[email protected]