Tramp : కోర్టుకు అక్షరాలా 1460 కోట్ల రూపాయలు జరిమానా చెల్లించిన ట్రంప్
కోర్టు హామీ కింద 175 మిలియన్ డాలర్లు బాండ్ రూపంలో సమర్పించాలని ఆదేశించింది.
జయభేరి, న్యూ డిల్లీ :
అమెరికా అధ్యక్ష పీఠాన్నిరెండోసారి దక్కించుకునేందుకు పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ కోర్టుకు భారీ మొత్తంలో బాండ్ సమర్పించారు. తద్వారా తనకు విధించిన 454 మిలియన్ డాలర్ల జరిమానా విషయంలో కోర్టు తదుపరి చర్యలు తీసుకోకుండా జాగ్రత్త పడ్డారు. ఇంతకీ ట్రంప్ కోర్టుకు సమర్పించిన బాండ్ విలువ ఎంతంటే… అక్షరాలా 1460 కోట్ల రూపాయలు (175 బిలియన్ డాలర్లు).ట్రంప్ తన ఆస్తుల విలువను ఎక్కువగా చూపించి బీమా సంస్థలను, బ్యాంకులను బురిడీ కొట్టించారని ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. న్యూ యార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ వేసిన ఈ కేసులో ట్రంప్ కు కోర్టు 454 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. దీనిపై అప్పీలుకు వెళ్లాలంటే కోర్టు హామీ కింద 175 మిలియన్ డాలర్లు బాండ్ రూపంలో సమర్పించాలని ఆదేశించింది. ట్రంప్ దోషిగా తేలితే పైకోర్టులో ఈ డబ్బు ఆయనకు తిరిగిరాదు సరికదా.. కింది కోర్టు విధించిన 454 మిలియన్ డాలర్లనూ చెల్లించవలసి ఉంటుంది.
Post Comment