భారత్ మిత్రదేశాలలో అలజడి...
సరిహదులను మారుస్తూ మ్యాప్‌లు విడుదల చేస్తోంది. ఈ క్రమంలోనే కోవిడ్ సమంలో గాల్వన్‌లోకి చొచ్చుకొచ్చేందుకు చైనా సైన్యం యత్నించింది. దీనిని భారత సైన్యం దీటుగా తిప్పి కొట్టింది. అప్పటి నుంచి చైనాకు కంటిమీద కునుకు ఉండడం లేదు. భారత్‌ను ఎలాగైనా దెబ్బతీయాలని దొడ్డి దారిని ఎంచుకుంది. ఇందుకోసం భారత మిత్ర దేశాలను దూరం చేసే కుట్ర పన్నుతోంది.
భారత్ టార్గెట్‌గా చైనా పాకిస్తాన్‌తో కలిసి కొత్త ఎత్తుగడలు వేస్తోంది. అభివృద్ధిలో దూసుకుపోతున్న భారత్‌లో అల్లర్లు, అశాంతి సృష్టించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. కోవిడ్ సమయంలో చైనా యాప్‌లపై భారత్ నిషేధం విధించింది. ఇక చైనా లోన్ యాప్‌లను బ్యాన్ చేసింది. ఈ క్రమంలో చైనాకు తీవ్ర ఆర్థిక నష్టం కలిగింది. దీంతో భారత భూభాగాలను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తోంది.
కానీ, ఇప్పటికీ అల్లర్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే వెయ్యి మంది వరకు మరణించారు. ప్రస్తుతం మైనారిటీలు, హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో ఆలయాలను ధ్వంసం చేశారు. హిందువులను చంపుతున్నారు. పరిస్థితి చూస్తుంటే ఈ అల్లర్ల ఉద్దేశం రిజర్వేషన్లు కాదని, దేశంలో అలజడి సృష్టిండచమే అని తెలుస్తోంది. తద్వారా భారత్‌లో అలజడి సృష్టించడమే అని తెలుస్తోంది అందుకే షేక్ హసీనా రాజీనామా చేసినా.. అల్లర్లు ఆగడం లేదు. భారత్‌తో బంగాదేశ్‌కు ఉన్న వ్యాపార సంబంధాలను దెబ్బతీయడం, భారత వ్యతిరేక ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా చైనా పాకిస్తాన్‌తో కలిసి కుట్ర చేసిందని తెలుస్తోంది. బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల వివాదం నేపథ్యంలో.. నెలకొన్న అల్లర్ల వల్ల తన ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఆమె ఆర్మీ హెలికాప్టర్లో భారత్ చేరుకున్నారు. ఇంగ్లాండ్ దేశానికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తనను తాను రాజకీయ శరణార్థిగా ఆమె ప్రకటించుకున్నారు.
అయితే ఇంగ్లాండ్ నుంచి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో ప్రస్తుతం ఆమె భారత్ లోనే తల దాచుకుంటున్నారు. షేక్ హసీనా రాజీనామా తర్వాత కూడా ఆ దేశంలో అల్లర్లు తగ్గుముఖం పట్టలేదు. పైగా ఆ దేశానికి చెందిన సుప్రీంకోర్టు జడ్జి, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కూడా తమ పదవులకు రాజీనామాలు చేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.ప్రధానమంత్రి పదవికి రాజీనామా తర్వాత షేక్ హసీనా తొలిసారిగా నోరు విప్పారు. ఒక ఆంగ్ల పత్రికతో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా సంచలన ఆరోపణలు చేశారు. ” నా దేశంలో నేను శవాల వేడుకను చూడాలని అనుకోలేదు. విద్యార్థుల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి కొంతమంది అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని భావించారు. దానికి నేను ఏమాత్రం అంగీకరించలేదు. అలాంటివి తట్టుకోలేక ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశాను.
ఒకవేళ నేను సెయింట్ మార్టిన్ ద్వీపంలో అధికారాన్ని గనక అప్పగించి.. అమెరికాకు బంగాళాఖాతంలో స్థానం ఇస్తే.. కచ్చితంగా ప్రధానమంత్రి పదవిలో ఉండేదాన్ని. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ నేను ధైర్యంగానే ఉన్నాను. బంగ్లాదేశ్ ప్రజల శ్రేయస్సు కోసం పని చేశాను. ఇప్పటికైనా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అతివాదుల మాయలో పడకండి” అని షేక్ హసీనా ప్రకటించారు.బంగ్లాదేశ్లో నెలకొన్న అల్లర్ల వల్ల చాలామంది నాయకులు చనిపోయారు.. అవామీ లీగ్ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. ఆందోళనకారులు ధ్వంసం చేయడం వల్ల బంగ్లాదేశ్ ఓ సంక్షుబిత దేశంగా మారిపోయింది. అయితే త్వరలోనే షేక్ హసీనా బంగ్లాదేశ్ తిరిగి వెళ్తానని ప్రచారం జరుగుతోంది. దేవిశాన్ని ఆమె ఓ ఆంగ్ల పత్రికకు పంపిన సందేశంలో పేర్కొన్నారు. అవామీ లీగ్ ధైర్యంగా నిలబడుతుందని ఆమె వెల్లడించారు. బంగ్లాదేశ్ సంక్షేమం కోసం తాను భగవంతుడికి ప్రార్ధనలు చేస్తున్నానని షేక్ హసీనా ఆ సందేశంలో వెల్లడించారు.ఆగస్టు ఐదు నుంచి బంగ్లాదేశ్లో అల్లర్లు తారాస్థాయిలో జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా గత వారమే రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆమె భారత్ లో ఉంటున్నారు.
ఇంగ్లాండ్ లో ఆశ్రయం పొందడానికి ఆమె దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు మాత్రమే కాదు గత ఏడాది మే నెలలో కూడా హసీనా సంచలన ప్రకటన చేశారు. “మనదేశంలో ఎన్నికలు సాఫీగా జరగాలంటే ఒక దేశానికి బంగాళాఖాతంలో స్థావరం కల్పించాలి. కానీ అది అంత సులభంగా జరగదని” హసీనా పేర్కొన్నారు. అప్పట్లో హసీనా చేసిన ప్రకటన సంచలనంగా మారింది. సరిగా ఏడాది గడవగానే నాడు ఆమె అన్న మాటలు నేడు పునరావృతమయ్యాయి.
ఆమె తన పదవిని కూడా కోల్పోయారు.ఇక బంగ్లాదేశ్‌కు తర్వాత ఆర్థికసాయం, రుణాలు ఇచ్చి అక్కడ పాగా వేయాలన్నదే చైనా కుట్రగా తెలుస్తోంది.చైనా గతంలో మయన్మార్, శ్రీలంక, మాల్దీవుల్లోనూ ఇదే ఎత్తగడ వేసి సక్సెస్ అయింది. మయన్మార్‌లో ఆంగ్‌సాంగ్‌సూకీ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చింది. సైనిక ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించింది. ఇక శ్రీలంకకు కూడా భారీగా రుణాలు ఇచ్చింది. అవి తీర్చలేని పరిస్థితిలో శ్రీలంకలో అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి ఆ దేశంపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తోంది. ఇక మాల్దీవులు కూడా ఇప్పటికే చైనా చేతుల్లోకి వెళ్లింది. గతంలో ఈ మూడు భారత మిత్ర దేశాలే. వీటిని భారత్‌కు దూరం చేయడమే లక్ష్యంగా పన్నిన కుట్రలో కొంత వరకు చైనా సక్సెస్ అయింది. అందుకే ఇప్పుడు మరో మిత్ర దేశమైన బంగ్లాదేశ్‌పై పడింది. సైలెంట్‌గా ఉంటూ అలజడి సృష్టిస్తోంది.
Post Comment