బడ్జెట్ పై సలహాలు ఇస్తారా..

ఈ నెల 23న కేంద్రం పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. ఈ సాధారణ బడ్జెట్‌లో పరిశ్రమలతో పాటు మధ్య తరగతి, దిగువ తరగతి ప్రజలపై భారీ ఆశలు పెట్టుకున్నారు. పెట్టుబడులను రాబట్టేందుకు కేంద్రం ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేయాలని భావిస్తోంది. గత పార్లమెంట్‌ సమావేశాల సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మోదీ 3.O ప్రభుత్వం సంస్కరణలను వేగవంతం చేయనుందని చెప్పారు.

బడ్జెట్ పై సలహాలు ఇస్తారా..

న్యూఢిల్లీ, జూలై 12 :
కేంద్ర బడ్జెట్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో మోదీ భేటీ అయ్యారు. సమావేశానికి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సైతం హాజరయ్యారు.

ఈ నెల 23న కేంద్రం పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. ఈ సాధారణ బడ్జెట్‌లో పరిశ్రమలతో పాటు మధ్య తరగతి, దిగువ తరగతి ప్రజలపై భారీ ఆశలు పెట్టుకున్నారు. పెట్టుబడులను రాబట్టేందుకు కేంద్రం ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేయాలని భావిస్తోంది. గత పార్లమెంట్‌ సమావేశాల సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మోదీ 3.O ప్రభుత్వం సంస్కరణలను వేగవంతం చేయనుందని చెప్పారు.పెట్టుబడులు రాబట్టడం ద్వారా వృద్ధిరేటు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రభుత్వం వ్యూహం సిద్ధం చేస్తోంది. అయితే, ఏ రంగంలో ఏ స్థాయిలో సంస్కరణలు అవసరమో ఆయా రంగాల నిపుణుల నుంచి అభిప్రాయాలను సేకరించాలని ప్రధాని మోదీ నిర్ణయించారు.

Read More Arvind Kejriwal Arrest I ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్

2047 నాటికి మోదీ సర్కార్ భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. సాధారణ బడ్జెట్ ద్వారా అభివృద్ధి చెందిన భారతదేశానికి ప్రభుత్వం రోడ్‌ మ్యాప్‌ను సిద్ధం చేయాలని, ఇందుకోసం ప్రత్యేకంగా మౌలిక సదుపాయాల రంగంలో ప్రత్యేక కృషి అవసరమని భావించారు. ఆర్థికవేత్తలతో పాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులు సైతం పేద, మధ్య దిగువ మధ్యతరగతి ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదాయపు పన్ను, గృహ రుణాల విషయంలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు ఊరట కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. పేదల కోసం కొత్త పథకాన్ని ప్రారంభించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.

Read More Elections : మరో వారంలో మొదటి దశ ఎన్నికలు

Views: 0

Related Posts