'లైలా' మెస్మరైజింగ్ ఐ లుక్ రిలీజ్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, రామ్ నారాయణ్, సాహు గారపాటి, షైన్ స్క్రీన్స్ 'లైలా' మెస్మరైజింగ్ ఐ లుక్ రిలీజ్- పూజా కార్యక్రమాలతో మూవీ గ్రాండ్ గా లాంచ్-  ఫిబ్రవరి 14న థియేట్రికల్ రిలీజ్

'లైలా' మెస్మరైజింగ్ ఐ లుక్ రిలీజ్

ఇది నిజంగా సర్ ప్రైజింగ్, డేరింగ్ స్టెప్. ఈ జనరేషన్ హీరోలెవరూ లేడీ క్యారెక్టర్ చేయడానికి సాహసం చేయరు. అయితే, డిఫరెంట్ జానర్‌ల చిత్రాలను చేస్తున్న మాస్ కా దాస్ విశ్వక్సేన్, షైన్ స్క్రీన్స్ సాహు గారపాటి నిర్మిస్తున్న తన లేటెస్ట్ మూవీ 'లైలా'లో మ్యాన్ అండ్ విమన్ గా కనిపించనున్నారు.

రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకుడు. విశ్వక్సేన్‌ను లైలాగా మునుపెన్నడూ లేని క్యారెక్టర్ లో ప్రజెంట్ చేయడానికి పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. బ్రేవ్ అండ్ టఫ్ క్యారెక్టర్ ని అంగీకరించడం మెంటల్ గా ఫిజికల్ గా ఛాలెంజ్ తో కూడుకున్నది.

Read More Sonakshi : కూరగాయల్లా బేరాలు ఆడుతుంటారు..

ఈరోజు, మేకర్స్ లైలా ఐ లుక్‌ని రిలీజ్ చేశారు. విశ్వక్ సేన్ లైలాగా ఛార్మింగ్ లుక్ తో అదరగొట్టారు. విశ్వక్సేన్‌కి ఇది బ్యూటీఫుల్ మేక్ఓవర్. అతను పర్ఫెక్ట్ గా విమన్ లా కనిపించిన లుక్ అద్భుతంగా ఉంది. ఫిమేల్ గెటప్‌లో విశ్వక్‌లా మరే యాక్టర్ కనిపించి ఉండరనడంలో సందేహం లేదు. ఆ పాత్రకు ఆయన ఎంత అద్భుతంగా సూట్ అయ్యాడో ఆ కళ్లను చూస్తేనే అర్థమవుతుంది. లైలాగా విశ్వక్సేన్ కంప్లీట్ ఫేస్ ని చూసేందుకు ఎక్సయిమెంట్ మరింతగా పెంచింది.

Read More anupama parameswar : ఒకప్పుడు తెలుగు సంప్రదాయ హీరోయిన్..

ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఈరోజు గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు కె. రాఘవేంద్రరావు క్లాప్‌ ఇవ్వగా, దర్శకుడు హరీష్ శంకర్ కెమెరా స్విచాన్ చేశారు. స్క్రిప్ట్‌ను నిర్మాతలు వెంకట సతీష్ కిలారు, జెమినీ కిరణ్ మేకర్స్‌కి హ్యాండోవర్ చేశారు.

Read More Sanya Malhotra  : కన్నతల్లే బద్ధ శత్రువు..  ఎన్నో అవమానాలు..

హై ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపొందనున్న ఈ సినిమాతో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. లైలా సినిమా కోసం టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. రిచర్డ్ ప్రసాద్ డీవోపీ కాగా, వాసుదేవ మూర్తి రైటర్. తనిష్క్ బాగ్చి, జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, అన్వర్ అలీ ఎడిటర్. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. 'లైలా' మూవీ ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. తారాగణం: విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ

Read More సోషల్ మీడియాను ఊపేస్తోన్న అమ్మపాడే జోలపాట సాంగ్.. 

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన

Social Links

Related Posts

Post Comment