జయభేరి, కర్నూలు, సెప్టెంబర్ 17 :
సంగమేశ్వరాలయ శిఖరం బయటపడటంతో.. ఆలయ పూజారులు జెండా కట్టి పూజలు చేశారు. ఆగస్టు 6వ తేదీ సంగమేశ్వరాలయం జలాధివాసమైంది. అయితే, నెల రోజుల తర్వాత ఆలయ శిఖరం దర్శనమిచ్చింది. ఇరవై మూడేళ్ల కాలంలో ఈసారి తక్కువగా ఐదు వారాల వ్యవధిలోనే శిఖరం కనిపించడం గమనార్హం. శ్రీశైలం జలాశయ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 864 అడుగులకు చేరింది. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను నల్లమల సాగర్ జలాశయానికి తరలించడంతో సంగమేశ్వర ఆలయం జలాధివాసం నుంచి బయటకు వచ్చింది.కృష్ణా నదికి వరద నీరు చేరినప్పుడు పూర్తిగా జలాధివాసమయ్యే నంద్యాల జిల్లాలోని సంగమేశ్వరాలయం.. మళ్లీ వేసవిలోనే బయటకు వస్తుంది. కానీ, ఈ ఏడాది జలాధివాసమైన కొద్ది రోజుల్లోనే దర్శనమివ్వనుంది. ఆగస్టు 6వ తేదీ సంగమేశ్వరాలయం జలాధివాసమైన సంగతి తెలిసిందే. అయితే, నెల రోజుల తర్వాత ఆలయ శిఖరం దర్శనమిచ్చింది. ఎగువ నుంచి ప్రవాహాలు లేకపోవడం, శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల కారణంగా ఆలయ శిఖరం దర్శనమిచ్చినట్లు ఆలయ పురోహితులు చెబుతున్నారుసంగమేశ్వరాలయ శిఖరం బయటపడటంతో.. ఆలయ పూజారులు జెండా కట్టి పూజలు చేశారు. జలాధివాసం అయ్యాక సాధారణంగా ఐదారు నెలలకు, అంటే వేసవి ప్రారంభంలోనే గానీ ఆలయ శిఖరం కనిపించదు. కానీ ఇప్పుడు నెల రోజుల్లోనే మళ్లీ ఆలయ శిఖరం దర్శనమిచ్చిందని పూజారులు చెబుతున్నారు. ఇరవై మూడేళ్ల కాలంలో ఈసారి తక్కువగా ఐదు వారాల వ్యవధిలోనే శిఖరం కనిపించడం గమనార్హం.శ్రీశైలం జలాశయ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 864 అడుగులకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 120 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ ఏడాది జలాశయం పూర్తిగా నిండకపోవడం, తెలంగాణ వైపు విద్యుదుత్పత్తి చేయడం, ఏపీ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు ద్వారా శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను నల్లమల సాగర్ జలాశయానికి తరలిస్తుండటంతో సంగమేశ్వర ఆలయం జలాధివాసం నుంచి బయటకు వచ్చింది.ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు లేనప్పటికీ ఎగువన కురిసిన భారీ వర్షాలకు కృష్ణా నదికి వరదలు రావడంతో ఆ నీరు శ్రీశైలం జలాశయానికి చేరింది. దాంతో శ్రీశైలం జలాశయం నీటితో కళకళలాడింది. ఫలితంగా సంగమేశ్వర ఆలయం పూర్తిగా జలాధివాసం అయింది. జలాధివాసం సందర్భంగా పురోహితులు, ఆలయ అర్చకులు గంగమ్మ తల్లికి భక్తిశ్రద్ధలతో చీర, సారె సమర్పించారు. అయితే, తిరిగి ఇప్పుడు శిఖర దర్శనం కావడంతో జెండా కట్టారు.గతేడాది జూన్ 15వ తేదీన సంగమేశ్వరస్వామి గర్భాలయంలోకి నీరు ప్రవేశించగా.. ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీన నీరు చేరింది. గతేడాది జూన్ 15న స్వామివారు జలాధివాసం కాగా.. మార్చిలో నీరు తగ్గి ఆలయం బయటపడింది. ఈ ఏడాది ఆగస్టు మొదటి వారంలో ఆలయం జలాధివాసం కాగా.. కేవలం ఐదు వారాల్లోనే ఆలయ శిఖరం కనిపించడం గమనార్హం.మార్చి నెలలో కనిపించాల్సిన సంగమేశ్వర ఆలయ శిఖరం.. వర్షాకాలం పూర్తి కాకముందే కనిపించడం ఎల్‌నినో తీవ్రతకు అద్దం పడుతోంది. ఇప్పుడే పరిస్థితి ఎలా ఉంటే వేసవిలో పరిస్థితి ఏంటి? ఎల్‌నినో తీవ్రమై వచ్చే వర్షాకాలంలో సరిగా వర్షాలు కురవకపోతే ఎలా ఉంటుందనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. జలాధివాసమైన ఐదు వారాలకే సంగమేశ్వర శిఖరం తిరిగి కనిపించడం శివయ్య భక్తులకు ఆనందం కలిగించే విషయమే అయినప్పటికీ.. భవిష్యత్తు సమస్యలకు ఇది ఓ సంకేతం కావచ్చనే భావనా వ్యక్తమవుతోంది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు శ్రీశైలం జలాల వినియోగం విషయంలో క్రమశిక్షణతో వ్యవహరించకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పకపోవచ్చు
జలాధివాసమైన 5 వారాలకే ‘సంగమేశ్వర’ శిఖర దర్శనం





