ఆస్తుల కోసం గొడవలు పెట్టుకోవాలన్న ఉద్దేశం నాకు లేదు.

ఆస్తుల కోసం గొడవలు పెట్టుకోవాలన్న ఉద్దేశం నాకు లేదు.

సామరస్యంగా పరిష్కరించుకోవాలని, నాలుగు గోడల మధ్య మాట్లాడుకోవాలని నాకూ తెలుసు. కానీ... కుటుంబ విషయాలను జగన్‌ రోడ్డు మీదకు తీసుకొచ్చారు. ఇప్పుడు కోర్టు వరకూ తీసుకువెళ్లారు. తల్లినీ, చెల్లినీ కోర్టుకు ఈడ్చడం సాధారణ విషయం కాదు జగన్‌ సార్‌!’’ 

ఆస్తుల మీద ప్రేమతో రక్త సంబంధాన్ని, అనుబంధాలను మరిచిపోయారని తన సోదరుడు వైఎస్‌ జగన్‌పై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. నాలుగు గోడల మధ్య కూర్చొని పరిష్కరించుకోవాల్సిన కుటుంబ విషయాలను రోడ్డు మీదకు తీసుకు వచ్చారని ఆగ్రహించారు. అది చాలదన్నట్లుగా ఇప్పుడు కోర్టు వరకూ తీసుకువెళ్లారని విమర్శించారు. ఆస్తులు ఇచ్చేది లేదంటూ లేఖ రాయడంతోపాటు, తల్లిపైనా నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్టీ)లో జగన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన సోదరి షర్మిల గురువారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు.

Read More పట్టభద్రుల MLC BRS అభ్యర్థిగా రాకేష్ రెడ్డి

‘కుటుంబ కలహాలు మామూలే’ అని జగన్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ‘‘కుటుంబాల్లో గొడవలు సాధారణమే అని జగన్‌ చెబుతున్నారు. కుటుంబ కలహాలు సామాన్యమేనంటూ తల్లిని, చెల్లిని కోర్టుకెందుకు ఈడ్చారు. ఇది సామాన్యమైన విషయం కాదు జగన్‌ సార్‌’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Read More RTI I ఆర్టీఐ  కమిషనర్ గా జర్నలిస్ట్ రెహానా బేగం నియామకం పట్ల "ప్రజా సంకల్ప వేదిక " అభినందనలు

Views: 0

Related Posts