జయభేరి సైదాపూర్ :
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల్ దుద్దెనపల్లి గ్రామంలో ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ మొదటిరోజు ప్రారంభించారు తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు ప్రత్యేకగా నిలిచే బతుకమ్మ పండగ నేటి నుంచి ప్రారంభమైనది ఆడపడుచులందరూ కలిసి సంబరంగా జరుపుకునే ఈ వేడుక ప్రకృతిని ఆరాధిస్తూ కుటుంబ అనుబంధాలను గుర్తు చేస్తూ సాగుతుంది తెలంగాణకే ప్రత్యేకమైన ఈ పూల ఉత్సవం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది





