జయభేరి, సైదాపూర్, నవంబర్ 12 (ప్రతినిధి ఎ.రాజేందర్)
సైదాపూర్ మండల కేంద్రంలోని డాగ్ స్క్వాడ్ తో విస్తృత తనిఖీలు,మాదక ద్రవ్యాలు, గంజాయి రవాణాను అరికట్టడానికి శాంతి భద్రతల పరిరక్షణ కోసం తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు డాగ్ స్క్వాడ్ (డాగ్ స్క్వాడ్ /సునీఫర్ డాగ్స్) తనిఖీలు నిర్వహిస్తారు. ప్రత్యేక శిక్షణ పొందిన స్నిఫర్ డాగ్ స్క్వాడ్ తో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, స్థానిక ఏఎస్ఐ పి సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం పోలీసులు విస్తృతంగా తనిఖీ నిర్వహించారు. డాగ్ స్క్వాడ్ తో మండల కేంద్రంలో పాత బస్టాండ్ ఆవరణలో భవాణి కిరణ్ జనరల్ స్టోర్, శ్రీ రాజరాజేశ్వర కిరాణం, షాపులు పై మండల కేంద్రంలోని పరిసరాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ.ఎస్ఐ. పి. సంపత్ రెడ్డి మాట్లాడుతూ మాదకద్రవ్యాలు గుర్తించడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాగ్స్ కార్డును తెప్పించామని, మాదకద్రవ్యాలను అరికట్టడానికి తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. మాదకద్రవ్యాలు వాడినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఈ గంజాయి డాగ్స్ వంటి మాదక ద్రవ్యాలు పేలుడు పదార్థాల వాసన పసిగట్టి వాటిని సులభంగా గుర్తించే గుణం ఉంటుందని, ఈ కారణంగానే జాగిలాలను తనిఖీల్లో ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. మాదకద్రవ్యాల సరఫరా చేసే వారితో పాటు, వినియోగించి వారిపై కూడా కేసులు నమోదు చేయునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సైదాపూర్ పోలీసులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





