U-19 Asia Cup : అండర్-19 (Under-19) ఆసియా కప్ 2026 (Asia Cup-2026) లో భారత యువ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇవాళ జరిగిన సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) పై భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బౌలింగ్‌లో సత్తా చాటిన భారత కుర్రాళ్లు.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ అదరగొట్టి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించారు. దాంతో ఫైనల్‌తో పాకిస్థాన్ (Pakistan) తో తలపడనున్నారు.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. నోమన్ సలార్‌జాయ్ (51), షా ఫైసల్ రహీమీ (51) అర్ధశతకాలతో రాణించారు. సుబ్‌హాన్ జఖైల్ 31 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో ఇషాన్ సూద్ మూడు వికెట్లు పడగొట్టగా ఆర్యన్ సావ్‌సాని రెండు వికెట్లు తీశాడు. 228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 36.5 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసి గెలిచింది.
కెప్టెన్ లక్ష్య రాయ్‌చందానీ (93) అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆర్యవీర్ సెహ్వాగ్ (51) అర్ధశతకంతో రాణించగా.. వీకే వినీత్ (57 నాటౌట్) అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. యశ్‌వర్ధన్ చౌహాన్ 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.




