జయభేరి, యాదాద్రి భువనగిరి :
పసల ఫౌండేషన్ ఆధ్వర్యంలోయాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఐదు రీజియన్స్ ల పరిధిలోని 32 జట్ల క్రికెట్ టీంల మధ్య టోర్నమెంట్ ను ఎమ్మెల్సీ శంకర్ నాయకతో కలసి ప్రారంభించినట్లు సంస్థ అధినేత విక్రమ్ సాగర్ వెల్లడించారు. పసల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కార్య క్రమాలను మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. స్పోర్ట్స్ తో పాటు కల్చరల్ యాక్టివిటీస్ ను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో గ్రామీణ ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వ హిస్తున్నామని అన్నారు. అక్టోబర్ 18 న ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు వెల్ల డించిన ఆయన విద్యార్థుల కు ఏఐ రోబోటిక్స్, సిఏ ఫౌండేషన్, ఐఏఎస్, ఐపీఎస్ లకు ట్రైనింగ్ ఇవ్వటంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు పేర్కొ న్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అందరూ సాధికారత సాధించాలనే ఉద్దేశ్యం తోనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తు న్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ / చైర్మన్ అర్జున్ మదను, సీఈవో గోకుల్ రమణ, కార్యవర్గ సభ్యులు వై రాజా, చిలువేరు శంకర్ తదితరులు పాల్గొన్నారు.






