SR01లోకల్ బాడీ ఎన్నికలు యధాతధం

జయభేరి, విజయవాడ, సెప్టెంబర్ 30 :
స్థానిక ఎన్నికలపై ఎన్నికల సంఘం ఒక క్లారిటీ ఇచ్చింది. ఎన్నికలు ఇంకో రెండు నెలలు ఆలస్యం అవుతాయనే వార్తలను ఖండించింది. పుకార్లను నమ్మొద్దని ప్రజలను కోరింది. స్థానిక ఎన్నికలకు సంబంధించి ఏ సమాచారమైన మీడియా సమావేశం ద్వారా వెల్లడిస్తామని పేర్కొంది. సోషల్ మీడియాలో వస్తున్న సమాచారాన్ని నమ్మే ముందు.. సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న వివరాలతో ధ్రువీకరించుకోవాలని సూచించింది. అలాగే స్థానిక ఎన్నికలపై పుకార్లు సృష్టించినా, ఫార్వార్డ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.ఏపీ స్థానిక ఎన్నికలపై ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ మరో రెండు నెలలు ఆలస్యం అవుతుందనే వార్తలను ఖండించింది. ఈ పుకార్లలో ఎలాంటి వాస్తవం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. ఎన్నికల ఆలస్యంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేసింది.

ఇందులో ఏ మాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది. ఈ ఫేక్ వార్తలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని తెలిపింది. ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్ల కోర్టు కేసులపై క్లారిటీ వచ్చాకే ప్రక్రియ ప్రారంభమవుతుందనే ప్రచారంలో నిజం లేదని ఏపీ ఎస్ఈసీ వెల్లడించింది. స్థానిక ఎన్నికలపై కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, ఇలాంటి కల్పిత సమాచారాన్ని ఇతరులకు పంపించ వద్దని ఎన్నికల సంఘం కోరింది.ఏపీ స్థానిక ఎన్నికల సమాచారాన్ని మీడియా సమావేశాల ద్వారా వెల్లడిస్తామని ఎన్నికల సంఘం స్పష్టంగా చెప్పింది. ఎన్నికల కమిషన్ పేరుతో కల్పిత, తప్పుదారి పట్టించే లేదా అనధికారిక సమాచారాన్ని పుట్టించినా, ఫార్వార్డ్ చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. సోషల్ మీడియా, వాట్సాప్‌ల ద్వారా వచ్చే మెసెజ్‌లను నమ్మే ముందు ఎస్‌ఈసీ అధికారిక వెబ్‌సైట్, అధికారిక ప్రకటనల ద్వారా సమాచారాన్ని ధ్రువీకరించుకోవాలని సూచించింది.ఏపీలో మండల ప్రజా పరిషత్‌లు, జిల్లా ప్రజా పరిషత్‌ల ఐదేళ్ల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రాష్ట్రంలో 123 పట్టణ స్థానిక సంస్థలకు మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలుస్తుంది. అయితే ఎన్నికల తేదీ, పూర్తి షెడ్యూల్‌ ఇంకా అధికారికంగా వెలువడ లేదు. కానీ ఇప్పటికే పట్టణాలు, పల్లెల్లో ఈ ఎన్నికల హాడావిడి కనిపిస్తుంది. రాజకీయ పార్టీలు కూడా స్థానిక ఎన్నికల కోసం సన్నాహాలు చేసుకుంటున్నాయి. కాగా గత 2021 మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలుపొందింది. కార్పొరేషన్‌ వార్డుల లెక్కలోనూ ఆ పార్టీ ఆధిపత్యం సాధించింది. మరి 2026 స్థానిక ఎన్నికల్లో ఎవరిదీ పై చేయిగా ఉండబోతుందనే అంశం ఆసక్తికరంగా మారింది.

jayabherinews@gmail.com
Written by

[email protected]

↑