మళ్లీ మేనల్లుడికి బాధ్యతలు...

పార్టీ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్న వేళ బీఎస్సీ సుప్రీం లీడర్‌ మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‎ను రాజకీయ వారసుడిగా ప్రకటించారు. 

మళ్లీ మేనల్లుడికి బాధ్యతలు...

జయభేరి, లక్నో :
లోక్‌సభ ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత బీఎస్పీ చీఫ్‌ మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వారసుడిగా మేనల్లుడు ఆకాశ్‌ ఆనంద్‌ను ప్రకటించారు. అంతేకాకుండా పార్టీ జాతీయ కన్వీనర్‌గా కూడా నియమించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కలేదు. పార్టీ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్న వేళ బీఎస్సీ సుప్రీం లీడర్‌ మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‎ను రాజకీయ వారసుడిగా ప్రకటించారు. 

అంతేకాకుండా ఆకాశ్ ఆనంద్‌ను బీఎస్పీ జాతీయ సమన్వయకర్తగా కూడా నియమించారు. లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీ ఒక్క స్థానం కూడా గెలవలేదు. పార్టీ భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మాయవాతి లక్నోలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆకాశ్ ఆనంద్ సహా జాతీయ స్థాయి నేతలతో పాటు, అన్ని రాష్ట్రాలకు చెందిన బీఎస్పీ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.గతంలో కూడా ఆకాశ్‌ ఆనంద్‌ను వారసుడిగా ప్రకటించారు మాయావతి. అయితే ఎన్నికల ముందు అతడిని రెండు హోదాల నుంచి తొలగించారు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అనే అంశాల ప్రాతిపదికగా, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తిగా తాను, కాన్షీరామ్ కలిసి పార్టీని ఏర్పాటు చేసి, అందుకోసం తమ జీవితాలను సైతం త్యాగం చేశామని మాయావతి ఎన్నికల ముందు పేర్కొన్నారు. 

Read More అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాలు

లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీఎస్పీ 424 మంది అభ్యర్థులను బరిలో దించింది. వారిలో ఒక్కరు కూడా గెలవలేదు. ఈ క్రమంలో.. రెండు హోదాల నుంచి తొలగించిన కొన్ని రోజులకే, మాయావతి తన మేనల్లుడికి అవే హోదాలను తాజాగా తిరిగి కట్టబెట్టారు. బీఎస్పీలో యూత్‌లీడర్‌గా ఆకాశ్‌కు మంచి పేరుంది. చాలా దూకుడుగా వ్యవహరిస్తారని బీఎస్పీ నేతలు చెబుతుంటారు. అందుకే మేనల్లుడినే తిరిగి నమ్ముకున్నారు బెహన్‌జీ. పార్టీ పగ్గాలను ఆకాశ్‌కు అప్పగించాలని నిర్ణయించుకున్నారు.

Read More 24 గంటల్లో 24 ప్లాస్టిక్ సర్జరీలు

Latest News

ప్రపంచం కమ్యూనిస్టుల వైపు చూస్తున్నది...  ప్రపంచం కమ్యూనిస్టుల వైపు చూస్తున్నది... 
నేడు ప్రపంచ దేశాలలో తమ ఆయుధ  వ్యాపారి కరణ లక్ష్యంతో యుద్ధాలు సృష్టిస్తున్న అమెరికా ఒకవైపు అయితే చిన్న చిన్న మధ్యతరహా దేశాలన్నీ చైనా వైపు మగ్గుచూపుతున్నాయని...
రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు  కలెక్టర్
ఈనెల 25న జరిగే రవీంద్ర భారతిలో బీసీల సమరభేరిని విజయవంతం చేయండి
భగవాన్ సత్యసాయి పుట్టినరోజు మహిళా వృద్ధుల ఆశ్రమ నిర్మాణమునకు రు. 50,116 విరాళం 
ఘనంగా మాజీ ఎమ్మెల్యే శ్రీ రామావత్ రవీంద్ర కుమార్ దేవరకొండ పుట్టినరోజు వేడుకలు
తెలంగాణ భవన్లో ఘనంగా దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ జన్మదిన వేడుకలు