ప్రపంచం కమ్యూనిస్టుల వైపు చూస్తున్నది...
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నేడు ప్రపంచ దేశాలలో తమ ఆయుధ వ్యాపారి కరణ లక్ష్యంతో యుద్ధాలు సృష్టిస్తున్న అమెరికా ఒకవైపు అయితే చిన్న చిన్న మధ్యతరహా దేశాలన్నీ చైనా వైపు మగ్గుచూపుతున్నాయని అన్నారు. ఒకనాడు అమెరికా చుట్టూ తిరిగిన వారే ఈరోజు చైనా వైపు చేరుతున్నారని తెలిపారు. గాజా కు మద్దతిస్తూ ఆయుధ సామాగ్రి సరఫరా చేస్తూ ఫలస్తీనా వంటి ఒక పేద దేశంపై యుద్ధం చేయడం చిన్నపిల్లలు పాఠశాలలో ఆరోగ్య కేంద్రాలు సైతం తమ బాంబుల ధాటికి ధ్వంసం అయిపోతున్న అరాచకత్వాన్ని చూస్తున్నాం.
జయభేరి, హైదరాబాద్ :
ప్రపంచం కమ్యూనిస్టుల వైపు చూస్తున్నది. ప్రపంచానికి కమ్యూనిస్టులే దిక్సూచి అని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి అమ్మినేని వీరభద్రం అన్నారు. కమ్యూనిస్టులకు భవిష్యత్తు ఉన్నదా అని కొందరు ప్రశ్నిస్తారు. కానీ కమ్యూనిస్టులు లేకుండా ప్రపంచానికి భవిష్యత్తు ఉన్నదా అనే పరిస్థితి వచ్చిందని తమ్మినేని వీరభద్రం తెలిపారు. సిపిఐఎం గ్రేటర్ హైదరాబాద్ సౌత్ జిల్లా నాలుగవ మహాసభలు కామ్రేడ్ సయ్యద్ ఇబ్రహీంనగర్ పాలకీ గార్డెన్ ఫంక్షన్ హాల్ హుస్సేని హలం నవంబర్ 23/ 2024న జరిగినది.
బంగ్లాదేశ్ లో అక్కడి విద్యార్థుల నాయకత్వంలో జరిగిన ఉద్యమం దేశ అధ్యక్షున్ని పారిపోయే పరిస్థితికి తీసుకువచ్చింది. అది రెండు సంవత్సరాల నుంచి శ్రీలంకలో జరుగుతున్న రాజకీయ సంక్షోభం తీవ్రస్థాయికి పోయి అక్కడి అధ్యక్షుడు కనిపించకుండా పోయాడు అక్కడి ప్రజలు వామపక్ష నాయకుడిని దాదాపు ఏకగ్రీవంగా అధికారానికి తెచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో భవిష్యత్తు ప్రపంచానికి కమ్యూనిజమే దిక్సూచి అనే మనం అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇలా ప్రపంచమంతా ఒకవైపు పోతుంటే మనదేశంలో బిజెపి .ఎన్ డి ఏ ప్రభుత్వాలు దేశాన్ని అనాగరిక సంస్కృతిలో నెట్టేస్యడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు హిందుత్వ శక్తులతో వెనుకబడ్డ తరగతులపై బహిరంగదాడులు చేపిస్తారు. ప్రజల్లో గొడవలు రేపుతారు. మరోవైపు నిరుద్యోగ సమస్యల్లో నెట్టేస్తూ ప్రజలకు కనీస వసుధలకు దూరం చేస్తున్నారు.
రాజ్యాంగంలో నుంచి మెజారిటీ ప్రజలకు అనువైన చట్టాలను మారుస్తూ హిందుత్వ రాజ్యాంగాన్ని ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నారు సనాతన ధర్మం అంటే ఒక సంస్కృతిని పెంచుకోవడానికి పూజలు చేయడానికి, యాత్రలు నిర్వహించడానికి అయితే ఇది ప్రజాస్వామ్య దేశం. ఎవరి ఇష్టం వారిది. తప్పులేదు. కానీ నేడు బిజెపి చెప్తున్నటువంటి సనాతన ధర్మం కులవివక్షను పెంచి పోషించే ధర్మంగా ఉంటుంది. కులవృత్తులు అనాదికాలంలో ఉన్నటువంటి భూస్వామ్య సమాజంలో ఉన్న అనాగరిక సంస్కృతిని తిరిగి ముందుకు తెచ్చి మేమే నిజమైన దేశభక్తులం ఈ దేశం కేవలం హిందువులదే అంటారు.
కానీ హిందువులదైతే మంచిదే కానీ, హిందుత్వవాదులది కాకూడదన్నదే మేము ప్రజల ముందు ఉంచుతున్నామని అన్నారు. హిందుత్వం అంటే సనాతన ధర్మం ప్రకారం 3 వేలకు పైగా ఉన్న కులాలను ముందుకు తీసుకురావాలి మనధర్మశాస్త్రాన్ని మన దేశ రాజ్యాంగంగా ముందుకు తీసుకురావాలని తహతహలాడుతున్నారని దీన్ని ప్రజలు గ్రహించారు .కనుకనే ఈసారి ఎన్నికల పరిస్థితుల్లో బిజెపిని దూరం చేశాయని తెలిపారు గతంతో పోలిస్తే బిజెపికి ఓట్ల శాతం పూర్తిగా తగ్గింది .కానీ ప్రాంతీయ పార్టీలు కొన్ని మద్దతు ఇవ్వడంతో ఎన్డీఏ కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. బిజెపికి మద్దతు ఇస్తున్న స్థానిక పార్టీలు భవిష్యత్తులో స్థానం లేకుండా పోయే పరిస్థితి వస్తుందనేది గమనించడం లేదు ప్రాంతీయ అధికార పార్టీలను నాశనం చేయడమే బిజెపి లక్షంగా ఎంచుకున్న విషయం .వారు గ్రహించాలని అన్నారు.
రాష్ట్రంలో చూస్తే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కేస్తుందని అన్నారు. గ్యారెంటీలలో ఏ ఒక్కదాన్ని అమలు చేయడం లేదని అన్నారు. ప్రజా సమస్యలను పక్కకు నెట్టి మూసీ నది సుందరీ కరణ పేరుతో రాష్ట్రాన్ని గందరగోల పరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసినది సుందరీకరణ అంటే పేద ప్రజలను అక్కడి నుంచి తరిమేసి వాళ్ల ఇల్లు వాకిలి కూల్ చేయడం సుందరి కరణ కాదని అన్నారు. తీసేసి ధనవంతుల భవనాలు కట్టి అక్కడ వ్యాపారం చేసుకోవడం అని అనుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు .ఇప్పటికే 15 వేల ఇండ్లు కూల్చేసిన ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా పేరు వచ్చిందని తెలిపారు.
ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యాపార కేంద్రాల కోసం పేదల భూములను సేకరించడం అన్యాయమని అన్నారు. గతంలో ఉన్న టిడిపి టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కూడా గుర్తించి తమ పాలన వారి కంటే మెరుగుగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. భవిష్యత్తులో ప్రజా వ్యతిరేక విధానాలకు అమలు చేస్తే సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. నిరుద్యోగ సమస్యతో రాష్ట్రం ఆకలితో ఆల్మటిస్తోందని అన్నారు. ఉద్యోగాలకు అర్హులైన లక్షల మంది యువకులు మెకానిక్ షెడ్లలో కిరాణా కొట్టులలో, హోటల్లో, ఆటో డ్రైవర్లుగా కార్ డ్రైవర్లుగా పనిచేస్తూ పేదరికం ని చవిచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కారణంగా అసంఘటిత కార్మికులు రోజురోజుకు పెరిగిపోతున్నారని తెలిపారు.
హైదరాబాద్ మహానగరంలో వలస కార్మికులు కూడా పెరుగుతున్నారని వారికి కనీస సౌకర్యాలు కల్పించలేని దుస్థితి ఈ ప్రభుత్వ విధానాల వల్ల ఎదురవుతోందని తెలిపారు. ఈ ప్రభుత్వ విత్తనాలను రెండు కట్టాలంటే కార్మికులు , కర్షకులు , విద్యార్థి యువజనలు, మహిళలు ఐక్య ఉద్యమాలు, పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. 400 చరిత్ర గల హైదరాబాద్ పాత నగరంలో మతోన్మాదుల కారణంగా నిరుద్యోగం, విద్య, వైద్యం పూర్తిగా అందకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంలో సిపిఎం పార్టీ స్థానిక ప్రజల సమస్యలపై ఉద్యమిస్తూ ముందుకెళ్లడం హర్షనీయం అన్నారు. నీ మహాసభల్లో తీసుకున్న భవిష్యత్ కర్తవ్యాలను పూర్తిగా నిర్వర్తించి ముందుకెళ్లాలని కోరారు.
సిపిఎం హైదరాబాద్ సౌత్ కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సౌత్ కమిటీ కార్యదర్శి మమ్మద్ అబ్బాస్.. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి నరసింహారావు.. ప్రభాకర్... హైదరాబాద్ నగర మాజీ కార్యదర్శి పిఎస్ఎన్ మూర్తి.. ప్రస్తుత హైదరాబాద్ నగర కార్యదర్శి ఎం శ్రీనివాస్.., హైదరాబాద్ జిల్లా నాయకులు జి విటల్,.. పి నాగేశ్వరరావు.., శశికళ ..లక్ష్మమ్మ... ఎల్.కొటయ్య.. ఎం మీనా.. శ్రావణ్ .. కిషన్ ..జంగయ్య... కృష్ణ... తదితరులు పాల్గొన్నారు.
Post Comment