సీఆర్ పీ ఎఫ్ పాఠశాలలో ప్రారంభమైన జిల్లా స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ సెలక్షన్ పోటీలు

పోటీలను ప్రారంభించిన సీఆర్ పీఎఫ్ గ్రూప్ సెంటర్ డీఐజిపి అనిల్ మీన్స్

సీఆర్ పీ ఎఫ్ పాఠశాలలో ప్రారంభమైన జిల్లా స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ సెలక్షన్ పోటీలు

జయభేరి, నవంబర్ 23:
సిఆర్పిఎఫ్ పాఠశాలలో జిల్లాస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ సెలక్షన్  టోర్నమెంట్స్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు  సిఆర్పిఎఫ్ గ్రూప్ సెంటర్ డిఐజిపి అనిల్ మీన్స్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, క్రీడలు , సాంస్కృతిక కార్యక్రమాలకు సిఆర్పిఎఫ్ పాఠశాల ఎంతో ప్రాధాన్యతిస్తుందని పేర్కొన్నారు.  విద్యార్థులు క్రీడలను ప్రాధాన్యంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. అనంతరం  ప్రిన్సిపాల్ అపర్ణ మాట్లాడుతూ విద్యార్థి దశ ఎంతో కీలకమని,  ఈ దశలో విద్యార్థులు క్రీడలకు సముచిత స్థానం కల్పించుకొని చదువుతోపాటు క్రీడలకు ముందు ఉండాలని అన్నారు.  నేటి సమాజం పూర్తిగా  మొబైల్ క్రీడలలో నిమగ్నమైందని దాని నుంచి బయటికి రావాలంటే విద్యార్థులు ఉదయం సాయంత్రం వేళలో ప్రతిరోజు క్రీడా  మైదానంలో ఉంటూ తమ శిక్షణలో ముందుకెళ్లాలని సూచించారు. 

Read More ఈనెల 25న జరిగే రవీంద్ర భారతిలో బీసీల సమరభేరిని విజయవంతం చేయండి

WhatsApp Image 2024-11-24 at 06.35.19

Read More ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి 

ఇక, ఆర్గనైజ్ సెక్రెటరీ కూరపాటి రాజశేఖర్ మాట్లాడుతూ 42 పాఠశాలల నుంచి 370 అథ్లెట్స్ మరియు వారి తల్లిదండ్రులు  పాల్గొన్నారని తెలిపారు.  ఈ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని  తెలిపారు. ఈ కార్యక్రమంలో కమాండెంట్ జనార్ధన్, హెడ్ మిసెస్ ఆశాజీ కుమార్ , వైస్ ప్రిన్సిపల్ హరి శంకర్ ,మేడ్చల్ జిల్లా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అశోక్, అసోసియేషన్ సభ్యులు లవకుమార్ గౌడ్, టెక్నికల్ కమిటీ మెంబర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, భాస్కర్ రెడ్డి, వినోద్, మన్మధరావు, ఉపాధ్యాయులు సబీనా,కిషోర్ కుమార్, వెంకట్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

Read More విశాల సహకార సంఘం అధ్యక్షులు కొత్త తిరుపతి రెడ్డిచే వడ్లు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు...

Latest News

ప్రపంచం కమ్యూనిస్టుల వైపు చూస్తున్నది...  ప్రపంచం కమ్యూనిస్టుల వైపు చూస్తున్నది... 
నేడు ప్రపంచ దేశాలలో తమ ఆయుధ  వ్యాపారి కరణ లక్ష్యంతో యుద్ధాలు సృష్టిస్తున్న అమెరికా ఒకవైపు అయితే చిన్న చిన్న మధ్యతరహా దేశాలన్నీ చైనా వైపు మగ్గుచూపుతున్నాయని...
రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు  కలెక్టర్
ఈనెల 25న జరిగే రవీంద్ర భారతిలో బీసీల సమరభేరిని విజయవంతం చేయండి
భగవాన్ సత్యసాయి పుట్టినరోజు మహిళా వృద్ధుల ఆశ్రమ నిర్మాణమునకు రు. 50,116 విరాళం 
ఘనంగా మాజీ ఎమ్మెల్యే శ్రీ రామావత్ రవీంద్ర కుమార్ దేవరకొండ పుట్టినరోజు వేడుకలు
తెలంగాణ భవన్లో ఘనంగా దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ జన్మదిన వేడుకలు