ఘనంగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మంజుల సహాదేవ్ ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం

పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఇతర ప్రధానోపాధ్యాయులు

ఘనంగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మంజుల సహాదేవ్ ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం

దేవరకొండ, అక్టోబర్29 : ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని, విద్యార్థులకు తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి మరువలేనిదని దేవరకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల గెజిటెడ్ హెడ్మాస్టర్ తైలం మంజుల సహాదేవ్ అన్నారు.

మంగళవారం పట్టణంలోని గౌట్ హైస్కూల్లో  ఏర్పాటు చేసిన గెజిటెడ్ హెడ్ మాస్టర్ మంజుల సహాదేవ్ ఉద్యోగ పదవి విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమంలో పలువురు ప్రధానోపాధ్యాయులు  ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికీ అతిధులు శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.

Read More జి ఎన్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

ఈ సందర్భంగా ఇన్చార్జి హెచ్ఎం  పందిరి నరసింహారెడ్డి, పిఆర్టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఎం. నారాయణ సింగ్ మాట్లాడుతూ.. మంజుల గత 29 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తూ ఎందరో విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దారని అన్నారు.
ఉపాధ్యాయ వృత్తి దేశ నిర్మాణానికి తోడ్పడుతుందని, ఉపాధ్యాయులు మొత్తం సమాజానికి బాధ్యత వహిస్తారని అన్నారు.

Read More పెట్రోల్ ధరల పెంపు? తప్పదా?

బాల బాలికలను భావిభారతలుగా తీర్చిదిద్దే బృహత్తర బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా మంజుల సహాదేవ్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఏ పాఠశాలకు వెళ్లిన సమయపాలన పాటిస్తూ అంకితభావంతో విధులు నిర్వహించాలని, ఉత్తమ విద్యా బోధనతోనే ఉపాధ్యాయులకు ప్రత్యేక గుర్తింపు పొందుతారని, పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని అన్నారు.

Read More సౌత్ జోన్ ఈఎన్ టీ సర్జన్ కాన్ఫరెన్స్ ప్రారంభం

Latest News

ఘనంగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మంజుల సహాదేవ్ ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం ఘనంగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మంజుల సహాదేవ్ ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం
దేవరకొండ, అక్టోబర్29 : ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని, విద్యార్థులకు తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి మరువలేనిదని దేవరకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల గెజిటెడ్ హెడ్మాస్టర్ తైలం మంజుల...
విశాల సహకార సంఘం అధ్యక్షులు కొత్త తిరుపతి రెడ్డిచే వడ్లు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు...
జర్నలిస్టుల రక్షణకు చట్టాన్ని తీసుకురావాలి..
చట్టం మీ చుట్టం కాదు..!
విశాల సహకార పరపతి సంఘం లి
ఐయన్టీయుసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మొగుళ్ల రాజి రెడ్డి నియామకం.