కెసీఆర్, హరీష్ రావు ,కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం

  • భగ్గుమన్న కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులు..
  • రవాణా ఖర్చులు 50 వేల రూపాయలు ఇచ్చామన్న హరీష్ రావ్ !
  • మాకు అందలేదన్న భూ నిర్వాసితులు..! 
  • ఆ డబ్బులు ఎక్కడికి వెళ్లినట్లు ?
  • రచ్చబండకు హరీష్ రావ్ ను ఆహ్వానించిన కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులు 

కెసీఆర్, హరీష్ రావు ,కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం

జయభేరి, గజ్వేల్ ములుగు, అక్టోబర్ 23 :
మాజీ మంత్రి హరీష్ రావ్ గజ్వెల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం ఎంతో చేశాము కుటుంబానికి 7లక్షల 50 వేల రూపాయలు ఇచ్చామని , 18 సంవత్సరాలు నిండిన వారికీ 250 గజాల ప్లాటు ఇచ్చామని , అలాగే దారి ఖర్చులకు 30 వేల రూపాయల నుండి 50 వేల రూపాయల వరకు ఇచ్చామని హరీష్ రావు అన్నారు. 

అందుకు నిరసనగా కొండపోచమ్మ సాగర్ ఆర్అండ్ఆర్ కాలనీ మామిడ్యాల బహిలింపుర్ తానెదర్ పల్లి నుండి నిర్వాసితులు అందరు కలిసి కేసీఆర్ ,హరీష్ రావు ,కేటీఆర్ దిష్టిబొమ్మ దహనంచేసి నిరసన తెలిపారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హరీష్ రావు మమ్మల్ని మోసం చేశారని నమ్మిన మమ్మల్ని నట్టేట ముంచారని వారు ఎద్దేవా చేశారు. దారి ఖర్చులకు 50 వేల రూపాయలు ఇస్తే అవి ఎవరి జేబులోకి పోయాయని నిర్వాసితులు అడుగుతున్నారు మీ పార్టీ లీడర్ల జేబులోకి వెళ్ళాయా లేదా ముంపు గ్రామాలలో ఇల్లులు ఖాళీ చేయించినందుకు వారికి ఆ డబ్బులు ఇచ్చారా అని అడిగారు. మాకు రవాణా ఖర్చుల కోసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆ డబ్బులు ఇప్పటికైనా మాకు ఇప్పించాలని హరీష్ రావును నిర్వాసితులు కోరారు.

Read More 2027లో దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు..!!

ఒకవేళ ఆ డబ్బులు ఇప్పించకపోతే మేము నిరసన ఉదృతం చేస్తామని నిర్వాసితులు హెచ్చరించారు. ఊర్లో నుండి చాలా సంవత్సరాల క్రితం వెళ్లిన వారికి కూడా ప్లాట్లు ఇల్లులు ఇప్పించారని నిజమైన నిర్వాసితులకు మొండి చేయి చూపించారని వారు బాదను వ్యక్తం చేశారు.  ఒంటరి మహిళలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు 750000 ఇస్తామని చెప్పి కొంతమందికి ఇంకా ఇవ్వలేదని అలాగే 18 సంవత్సరాలు నిండిన వారికి కూడా నెల రెండు నెలలు తక్కువ ఉన్నా కూడా వారికి ప్యాకేజీ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. 

Read More శ్రీ గౌరీ అవతారంలో అమ్మవారు 

టిఆర్ఎస్ నాయకుల బంధువులకు సన్నిహితులకు రోడ్డు పక్కనే ఇల్లులు ఇచ్చి వారికి సహకరించారని ,నిజమైన నిర్వాసితులకు వారు ఏం చేయలేదని వారు అన్నారు. వీటన్నిటికీ సమాధానం చెప్పాలని లేకపోతే నిరసన ఉధృతం చేస్తామని నిర్వాసితులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మామిడ్యాల తాజా మాజీ సర్పంచ్ నాగరాణి శ్రీనివాస్ గౌడ్, రాజు యాదవ్, శ్యాంసుందర్ రెడ్డి, శేఖర్, ప్రభాకర్ గుప్తా, కరుణాకర్ గౌడ్, ఎర్రోళ్ల మల్లేష్, తదితరులు పాల్గొన్నారు

Read More గాంధీభవన్ లో జరిగిన టిపిసిసి సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ల సమావేశం

Latest News

సైదాపూర్ మండలం మార్కెట్ కమిటీ చైర్మన్గా దొంత సుధాకర్ సైదాపూర్ మండలం మార్కెట్ కమిటీ చైర్మన్గా దొంత సుధాకర్
జయభేరి, సైదాపూర్ : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంతు సుధాకర్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా...
వచ్చే 20-25 ఏళ్లపాటు భారతదేశం ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. ఇదీ మోదీ అనే అసామాన్య వ్యక్తి సాధించిన విజయం. బీజేపీ కాషెట్టి కుమార్ 
collector vijaya krishnan : ప్రజా సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపాలి కలెక్టరు విజయ కృష్ణన్
భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొన్న ఎంపీపీ పైల, మాజీ సర్పంచ్ చుక్కా
ఘనంగా బండారు శ్రీను గురుస్వామి అయ్యప్ప పడిపూజ
పరవాడలో ఘనంగా కార్తీకమాస అన్న సమారాధన కార్యక్రమం