మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసిన లక్ష్మాపూర్ గ్రామస్తుడు

గ్రామంలో రహదారి సమస్యను మంత్రికి విన్నవించిన మధుకృష్ణ... సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసిన లక్ష్మాపూర్ గ్రామస్తుడు

జయభేరి, అక్టోబర్ 18:
మూడుచింతలపల్లి మండలం లక్మాపూర్ గ్రామo నుంచి కొట్యాల గ్రామానికి వెళ్లే రహదారి నిర్మాణ పనులు గత కొన్ని రోజులుగా పెండింగ్ లో వుంది. అయితే గత ప్రభుత్వం లోనే రహదారి నిర్మాణ పనులకు అనుమతి వచ్చినప్పటికీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో రోడ్డు పనులు  చాలారోజులుగా పెండింగులో ఉన్నాయి.

రహదారి నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండడంతో ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతం, రాములగుట్ట దేవస్థానికి  వెళ్లేందుకు కూడా ఇదే దారి కావటం వలన భక్తులు దేవస్థానముకు వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. ఇక వర్షాకాలంలో అయితే వీరి అవస్థలు అంత ఇంత కాదు. 

Read More కొనే వారు లేదు.. అమ్మేవాళ్లు గోళ్లు గిల్లుకుంటున్నారు

కొట్యాల, రాములగుట్ట రహదారి సమస్యపై లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన యువనాయకుడు క్యాతం మధు క్రిష్ణ, రోడ్లు భవనాల శాఖామంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారిని అయన నివాసములో కలిసి వినతి పత్రం అందచేసారు. ఈ సమస్యపై సానుకూలంగా స్పందించిన మంత్రి సంబంధిత  అధికారులతో  మాట్లాడి త్వరితగతిన  సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Read More తెలంగాణ క్రీడా పాఠశాలలో 2k రన్ విజయవంతం చేయాలి