ఘనంగా బండారు శ్రీను గురుస్వామి అయ్యప్ప పడిపూజ
జయభేరి, పరవాడ :
మండల కేంద్రం పరవాడ శివాలయం రోడ్డులో గల అయ్యప్ప స్వాముల పీఠం పీఠాధిపతి గురుస్వామి బండారు శ్రీను పెట్టుకున్న అయ్యప్పస్వామి పడిపూజ ఘనంగా జరిగింది.
అనంతరం సన్నిదానంలో ప్రతిష్టించిన దేవతామూర్తుల భక్తి గీతాలను అయ్యప్ప మాలధారకులు హుషారుగా ఆలపించారు.చివరగా నక్షత్ర హారతిని వెలిగించి అయ్యప్పకు సమర్పించిన పిదప శ్రీను స్వామి ఏర్పాటు చేసిన అల్పాహారం(సద్ది) ను స్వాములు బెత్తాయించారు. ఈ కార్యక్రమంలో స్ధానిక సర్పంచ్ ఎస్ అప్పలనాయుడు, గురుస్వాములు గండి సన్నిబాబు, తేలు చలపతిరావు, జంగాల త్రినాధరావు, బండారు సతీష్, అల్లంపల్లి శివ, బండారు రామారావు, స్వామిలు, బండారు శ్రీను స్వామి కుటుంభ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Latest News
04 Apr 2025 20:18:49
జయభేరి, మేడ్చల్ : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో వీధికుక్కలు ప్రజలను తీవ్రభయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. పగలురాత్రి తేడా లేకుండా గుంపులు, గుంపులుగా రోడ్లపై తిరుగుతూ చిన్న పిల్లలు, మహిళలు,...
Post Comment