మత్తుపదార్థాల అవగాహన కార్యక్రమం 

సిద్దిపేట జిల్లా యువజన అధికారి ఎం.రంజిత్ రెడ్డి అధ్యక్షతన అవగాహన కార్యక్రమం

మత్తుపదార్థాల అవగాహన కార్యక్రమం 

జయభేరి, గజ్వేల్, జనవరి 28 :
మై భారత్ - నెహ్రు యువ కేంద్ర సిద్దిపేట ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణం లో గల స్థానిక ఈ హబ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (బాలురు)లో మాదక ద్రవ్యాల పై నెహ్రూ యువ కేంద్ర సిద్దిపేట జిల్లా యువజన అధికారి ఎం.రంజిత్ రెడ్డి అధ్యక్షతన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. 

సిద్దిపేట ఏరియా ఆసుపత్రి సూపరంటెండెంట్, సైకాలజిస్ట్ డా.శాంతి మాట్లాడుతూ మత్తుపదార్థాల దుర్వినియోగం భారతదేశంలో పెరుగుతున్న సమస్య యువత, విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు మరింత ప్రమాదంలో ఉన్నారని, మత్తుపదార్థాల దుర్వినియోగ నివారణ - ప్రవర్తనా మార్పు పద్ధతుల పై వివరించారు. మత్తుపదార్థాల నివారణ కేంద్రాలు అందించే వైద్య సహాయంతో మత్తుపదార్థాల బానిసత్వం నుండి విముక్తి పొందడానికి కౌన్సెలింగ్ ద్వారా  సహాయం చేయవచ్చు అని యోగా, ధ్యానం మానసిక ఒత్తిడిని తగ్గించి, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేలా చేస్తుంది అని  కళాశాల ప్రిన్సిపల్ డా నిఖత్ అంజుమ్ తెలిపారు. 

Read More ముస్లిం లందరికీ ఇఫ్తార్ విందు

ప్రభుత్వం చేపట్టిన సమగ్ర చర్యల ప్రణాళిక,అవగాహన కార్యక్రమాలు, చట్టాల అమలు, పునరావాసం వంటి అంశాలపై దృష్టి సారించాలని నషా ముక్త్ భారత్ అభియాన్ జిల్లా కమ్యూనిటీ ఎడ్యూకెటర్ మురళి తెలిపారు. సమస్య పరిష్కారం, నిర్ణయం తీసుకోవడం, ఒత్తిడి నిర్వహణ వంటి జీవన నైపుణ్యాలను నేర్పించడం ద్వారా మత్తుపదార్థాలకు దూరంగా ఉండటానికి సహాయం చేయడం. మత్తుపదార్థాల దుర్వినియోగ నివారణకు సంబంధించిన చట్టపరమైన అంశాల పై యువతకు అవగాహన కలిగి ఉండాలని యెన్. వై.కె  జిల్లా ప్రోగ్రాం అధికారి జి.కిరణ్ కుమార్ సూచించారు. 

Read More వివాహ వేడుకల్లో పాల్గొన్న ఉద్యమ నాయకులు మహ్మద్ అప్జల్ ఖాన్

మత్తుపదార్థాల ఉత్పత్తి, విక్రయం, వినియోగంపై నియంత్రణలు విధించే చట్టాలు.
మత్తుపదార్థాల దుర్వినియోగానికి పాల్పడిన వారు శిక్షించబడతారని అన్నారు. ఆల్కహాల్ అండ్ మత్తు ఆధారిత పదార్థాలు సేవించి వాహనం నడపడం, హెల్మెట్ లేని ప్రయాణాలు చేయడం, త్రిబుల్ రైడింగ్ వంటి వాటి వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి, అనే విషయం విద్యార్థులకు గజ్వేల్ ట్రాఫిక్ సిఐ మురళి  తెలీయ జేశారు. పవన్ డ్రగ్ అబ్యూజ్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చాలా బాగా ఆకట్టుకుంది. సమావేశ అధ్యక్షులు కిరణ్ ముఖ్య అతిథులకు శిల్డ్ బహుకరించి శాలువాతో సన్మానం చేశారు. 

Read More ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 

WhatsApp Image 2025-01-28 at 20.52.53

Read More 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్న విద్యార్థులు

అలాగే కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ఉపాధ్యాయులు మహేందర్ విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షురాలిగా కళాశాల ప్రిన్సిపల్ డా నిఖత్ అంజుమ్, ముఖ్య అతిథిలుగా సిద్దిపేట ఏరియా ఆసుపత్రి సూపరంటెండెంట్ శాంతి, గజ్వేల్ పట్టణ ట్రాఫిక్ సిఐ మురళి, ఎస్. గణపతి రావు, వైస్  ప్రిన్సిపాల్ జీడీసీ గజ్వేల్, రోటరీ క్లబ్ మెంబర్ చంటి, గజ్వేల్ సి.డబ్ల్యూ.సి సభ్యులు దేశాబోయిన నర్సింహులు, నషా ముక్త్ భారత్ అభియాన్ జిల్లా కమ్యూనిటీ ఎడ్యూకెటర్ మురళి, యువజన సంఘాల ప్రతినిధి రాజు, ఆర్. పి లు నాగరాజు, పవన్ హాజరైనారు.

Read More వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి

Latest News

జ్యోతిరావు పూలే జయంతి... జ్యోతిరావు పూలే జయంతి...
సామాజిక సమానత్వానికి, మహిళా విద్యకు మార్గదర్శకులు జ్యోతిరావు పూలే. అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త  జ్యోతిరావు...
గౌడవల్లిలో కుక్కల స్వైర విహారం
జై బాపు -జై భీమ్ -జై సంవిధాన్ అభియాన్
జోరుగా మట్టి దందా... బేస్ మెంట్ పేరిట మట్టి విక్రయాలు...
"వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్" బ్రాండ్ అంబాసిడర్‌గా : ప్రొఫెసర్ యుద్ధవీర్ కట్టా 
తాటికల్ ఇసుక రీచ్ బంద్ చేయాలని ఆర్డీవోకు వినతి