మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డులో అభినందన సభ

మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డులో అభినందన సభ

జయభేరి, గజ్వేల్, జనవరి 28 :
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డు హౌసింగ్ బోర్డ్ కాలనీలో ప్రజలు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ తాజా మాజీ చైర్మన్ ఎన్ సి రాజమౌళి గుప్తా కి అభినందన సభ ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశంలో ఎన్సీ రాజమౌళి గుప్త మాట్లాడుతూ 18 వ వార్డులో గెలిచి ,మున్సిపల్ చైర్మన్ అవడం నా అదృష్టం అని అన్నారు. 

మీరు ఇచ్చిన ప్రేమ ,ఆదరణ, ఆప్యాయతతో, నేను మున్సిపల్ చైర్మన్ అయినందుకు నేను ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటానని అన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మనలను పొంది నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎవరికీ ఏ ఆపద వచ్చినా నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు. నిన్నటితో ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా హౌసింగ్ బోర్డ్ కాలనీవాసుల తరఫున అభినందన సభ ఏర్పాటు చేసి ఘనంగా శాలువతో సన్మానించి నారు. 

Read More క్షయ వ్యాధి పట్ల  అప్రమత్తంగా ఉండాలి.

అనంతరం హౌసింగ్ బోర్డ్ కాలనీవాసి తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన దేవసాని వాసుదేవ్ ని తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక హౌసింగ్ బోర్డ్ అధ్యక్షులు పాశం తిరుపతిరెడ్డి, లైన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు ఎ.మల్లేశం గౌడ్, యువ నాయకుడు కబడ్డీ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఎన్సీ సంతోష్ గుప్తా, తోకల జయసింహారెడ్డి , హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, మధురాల పండరి, శ్రీనివాస్ రెడ్డి ,అమరేందర్ రెడ్డి, టి. రాములు, బాలస్వామి రెడ్డి, కిషన్ దాస్, పేర్లు యాదగిరి, మోతే మధుసూదన్ రావు, నరేందర్, ప్రమోద్, బిక్షపతి సేటు, జనార్దన్ రెడ్డి, పి.రమేష్, రాజ నరేందర్ రెడ్డి, నారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Read More ముస్లిం లందరికీ ఇఫ్తార్ విందు

Latest News

జ్యోతిరావు పూలే జయంతి... జ్యోతిరావు పూలే జయంతి...
సామాజిక సమానత్వానికి, మహిళా విద్యకు మార్గదర్శకులు జ్యోతిరావు పూలే. అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త  జ్యోతిరావు...
గౌడవల్లిలో కుక్కల స్వైర విహారం
జై బాపు -జై భీమ్ -జై సంవిధాన్ అభియాన్
జోరుగా మట్టి దందా... బేస్ మెంట్ పేరిట మట్టి విక్రయాలు...
"వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్" బ్రాండ్ అంబాసిడర్‌గా : ప్రొఫెసర్ యుద్ధవీర్ కట్టా 
తాటికల్ ఇసుక రీచ్ బంద్ చేయాలని ఆర్డీవోకు వినతి