దండోరా దళపతి పాట ఆవిష్కరించిన మందకృష్ణ మాదిగ

మందకృష్ణ మాదిగ మీద పాట నిర్మించడం చాలా సంతోషంగా ఉంది.. కుండ భానుచందర్

దండోరా దళపతి పాట ఆవిష్కరించిన మందకృష్ణ మాదిగ

జయభేరి, మేడ్చల్ : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఉద్యమ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన అభిమానిగా పాటను నిర్మించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని  కుండ భానుచందర్ అన్నారు.

మంగళవారం దండోరా దళపతి నీకు వందనం పేరుతో రూపొందించిన పాటను మందకృష్ణ మాదిగ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కుండ భానుచందర్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ కి దళిత జాతి అలాగే సంబండ కులాల ప్రజలు కూడా ఎప్పుడు మద్దతుగా ఉంటారని  భానుచందర్ పేర్కొన్నారు.

Read More గౌడవల్లిలో కుక్కల స్వైర విహారం

ఏబిసిడి వర్గీకరనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న గొప్ప నాయకుడు మందకృష్ణ మాదిగ అని, ఎమ్మార్పీఎస్ నాయకుడు చేసిన ఉద్యమంతో ఎన్నో పథకాలను పేద బడుగు బలహీన ప్రజలకు అందించడం జరిగిందని గుర్తు చేశారు. మందకృష్ణ మాదిగ పోరాటం చూసి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ఇవ్వడం దళిత జాతి ప్రజలందరికీ ఎంతో గర్వకారణం అన్నారు. మందకృష్ణ మాదిగ  చేతుల మీదుగా దండోరా దళపతి అనే పాటను ఆవిష్కరించడం జరిగిందని దండోరా దళపతి పాట నిర్మాత ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కుండ భానుచందర్   తెలిపారు.

Read More ఎమ్మెల్సీ రామచంద్రారావును సన్మానించిన మేడ్చల్ జిల్లా బిజెపి అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్

ఈ  కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ కళామండల అధ్యక్షులు ఎన్.వై అశోక్ మాదిగ, రామచందర్ మాదిగ, బచ్చల కూర స్వామి మాదిగ, దండోరా దళపతి పాట నిర్మాత కుండ భానుచందర్, ఎర్రోళ్ల నర్సింగ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు తోకల చిరంజీవి మాదిగ, గుండె ఎల్లయ్య మాదిగ, తదితరులు పాల్గొన్నారు.

Read More మేడ్చల్ లో కీచక పోలీస్