ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 

PRTUTS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్ రెడ్డి 

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 

జయభేరి, సైదాపూర్ :
17 ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థి, పిఆర్టిటిఎస్ కరీంనగర్ ఉపాధ్యాయ శాసనమండలి అధికారిక అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి ఉదయం 11 గంటలకు స్థానిక పద్మనాయక ఫంక్షన్ హాల్ నుండి సుమారు 2000 మందితో ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. తదనంతరం హాజరైన ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యాపకులతో సమావేశం నిర్వహించడం జరిగింది. 

ఈ సమావేశాన్ని ఉద్దేశించి పి ఆర్ టియుటిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్ రెడ్డి మాట్లాడుతూ... కరీంనగర్ ఉపాధ్యాయ MLC అభ్యర్థి గా వంగ మహేందర్ రెడ్డిని, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాల్ రెడ్డిని గెలిపించిన తర్వాత ఆరు నెలల లోపు ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేస్తూ ఓ పి ఎస్ అమలు చేయలేకపోతే ఇద్దరు ఎమ్మెల్సీలతో ఆమరణ నిరాహార దీక్ష చేయిస్తానని అలాగే పెండింగ్ బిల్స్ పై ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని ఉపాధ్యాయుని ఎన్నుకుంటే ఉపాధ్యాయ సమస్యలు తెలుస్తాయి. సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి వంగ మహేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు. 

Read More చలో నల్లగొండ  రైతు మహాధర్న కార్యక్రమానికి బయలుదేరిన  చందంపేట మండల బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు

మాజీ కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ భట్టాపురం మోహన్ రెడ్డి మాట్లాడుతూ... సుమారు ఆరు పిఆర్సిలలో ఉద్యోగ ఉపాధ్యాయులకు మెరుగైన పిఆర్సి ఇప్పించి, వందల జీవోలు ఉపాధ్యాయుల ఒడిలో పోసిన సంఘం పిఆర్టియు అని, బతకలేక బడిపంతులు నుండి బతక నేర్పిన గురువుగా తీర్చిదిద్దిన చరిత్ర PRTU సంఘం ది అన్నారు. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా 20,000 పైగా పదోన్నతులు, 35,000 బదిలీలు, మోడల్ స్కూల్, కేజీబివీలకు బదిలీలు కల్పించిన సంఘం పిఆర్టియు అని తెలిపారు. 

Read More 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్న విద్యార్థులు

WhatsApp Image 2025-02-07 at 18.47.09

Read More మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేత

PRTUTS కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... నన్ను గెలిపిస్తే ఏ రాజకీయ పార్టీ కండువా కప్పుకోనని ఉపాధ్యాయుల సమస్యల కొరకు పోట్లాడుతానని కౌన్సిల్ సాక్షిగా మీ గొంతుకనవుతానని తెలియజేశారు. ఉద్యోగ విరమణకు ముందు అనేక సేవా కార్యక్రమాలు చేశానని ఉద్యోగ విరమణ తర్వాత కూడా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నానని రానున్న రోజుల్లో ఎమ్మెల్సీ ఫండ్ అంతా కూడా ప్రభుత్వ పాఠశాలల కు కేటాయిస్తానని వారి జీవితాలు మెరుగు కొరకు అహరహరం కృషి చేస్తానని, ఎల్లవేళలాఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటానని కార్పొరేట్ ని గెలిపిస్తే వారు బాగుపడతారు తప్ప ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ఏ మాత్రం పనిచేయరు అన్నారు. 

Read More నర్సారెడ్డి ఉన్నన్ని రోజులు గజ్వేల్ లో కాంగ్రెస్ పార్టీ బాగుపడదు..!

ఉపాధ్యాయుల సమస్య ల పై పూర్తి అవగాహన ఉన్న నన్ను గెలిపిస్తే ఉపాధ్యాయ సమస్యలపై కొట్లాడుతానని కాబట్టి తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని  ఉపాధ్యాయులను కోరారు. ఈ సమావేశానికి 33 జిల్లాల PRTUTS అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర జిల్లా మండల బాధ్యులు, మహేందర్ రెడ్డికి మద్దతు ఇస్తున్న 17 సోదర సంఘ రాష్ట్ర జిల్లా మండల బాధ్యులు పాల్గొన్నారు.

Read More ప్రతాప్ రెడ్డికి అందజేసిన నూతన క్యాలెండర్

WhatsApp Image 2025-02-07 at 18.47.09 (1)

Read More "వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్" బ్రాండ్ అంబాసిడర్‌గా : ప్రొఫెసర్ యుద్ధవీర్ కట్టా 

Latest News

జ్యోతిరావు పూలే జయంతి... జ్యోతిరావు పూలే జయంతి...
సామాజిక సమానత్వానికి, మహిళా విద్యకు మార్గదర్శకులు జ్యోతిరావు పూలే. అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త  జ్యోతిరావు...
గౌడవల్లిలో కుక్కల స్వైర విహారం
జై బాపు -జై భీమ్ -జై సంవిధాన్ అభియాన్
జోరుగా మట్టి దందా... బేస్ మెంట్ పేరిట మట్టి విక్రయాలు...
"వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్" బ్రాండ్ అంబాసిడర్‌గా : ప్రొఫెసర్ యుద్ధవీర్ కట్టా 
తాటికల్ ఇసుక రీచ్ బంద్ చేయాలని ఆర్డీవోకు వినతి