కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం

  • హామీల అమలులో పూర్తి  వైఫల్యం
  • ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, రుణమాఫీ ఇందిరమ్మ ఇళ్ల పేరిట ప్రభుత్వం మోసం చేస్తున్నది.
  • ఆత్మీయ భరోసా పథకాన్ని కోతలు విధించకుండా అమలు చేయాలి
  • ఇంకా రుణమాఫీ 70 శాతం మందికి కాలేదు. 
  • రైతు భరోసా కూడా 30 శాతం ఇచ్చి. 70 శాతం మందికి కాలేదు
  • ఏడాది గడిచినా మహిళలకు 2500 రూపాయలు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి. 
  • మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం

జయభేరి, గజ్వేల్, జనవరి 28 :
రుణ మాఫీ, రైతు భరోసా ఎగ్గొట్టిన రైతు వ్యతిరేక కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయడం జరుగుతుంది అని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం గజ్వేల్ మండలంలోని అహ్మదీపూర్ గ్రామానికి చెందిన బోయిని కరుణాకర్ 60 వేలు, డబ్బేట నరేష్ 11 వేలు  రూపాయలను అనారోగ్యంతో బాధపడి సీఎంఅర్అప్ కోసం అప్లై చేసుకోగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరిష్ రావు,  ఎమ్మెల్సీ యాదవ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిది నుండి మంజూరు అయిన చెక్కులను వారికి అందచేయడం జరిగింది. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇండ్ల విషయంలో ప్రజలను ఘోరంగా మోసం చేస్తున్నదని అని అన్నారు. ఆరు గ్యారంటీ లు, 420 హామీలను వంద రోజుల్లో పూర్తి చేస్తామని, 400 రోజులు పూర్తి అవుతున్న నెరవేర్చలేదు అని అన్నారు. ఆత్మీయ భరోసా పథకాన్ని కోతలు విధించకుండా అమలుచేయాలి అని డిమాండ్ చేశారు. రైతు భరోసా 10 వేలను 15 వేలు చేస్తామని ఎన్నికల్లో ప్రగల్బాలు పలికి కోతలు ఎగవేతలతో 12 వేలు ఇస్తున్నారని ,ఒక్కో రైతుకు ప్రభుత్వం 17,500 బాకీ ఉన్నది అని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలని కెసిఆర్ గొప్ప ఆశయంతో రైతుబంధు తీసుకొచ్చారు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎండగట్టాలి అని పిలుపు నిచ్చారు.

Read More దుద్దులపల్లి గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభం

అన్ని విభాగల్లో కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం అగ్రస్థానం లో నిలిస్తే రేవంత్ రెడ్డి సర్కార్ ఇపుడు రాష్ట్రాన్నీ ఆదమస్థానానికి దిగజారుస్తున్నారని గ్రామ స్థాయి నేతల నుంచి మంత్రుల స్థాయి వరకు దోచుకుతింటున్నారని వాపోయారు. మహిళలకు 2500 రూపాయలు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి అని వారు డిమాండ్ చేశారు. వ్యవసాయం చేసుకునే రైతులతో పాటు 22 లక్షల మంది కౌలు రైతులకు భరోసా ఇస్తామన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటో స్పష్టం చేయాలి. వ్యవసాయ కూలీలకూ ఇస్తామన్న డబ్బులు ఎపుడు ఇస్తారు డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ రాష్ట్రనికి శ్రీ రామ రక్ష అని అన్నారు.

Read More 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్న విద్యార్థులు

ఈ సమావేశంలో ప్యాక్స్ డైరెక్టర్ చాడా శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, మాజీ కో అప్షన్ అహ్మద్, సత్య గౌడ్, అమరెందర్ రెడ్డి, కుంట కిష్టారెడ్డి, సాకలి శ్రీనివాస్, కనకయ్య, రాజు ,రమేష్, ఎల్లయ్య, మల్ల గౌడ్, ప్రశాంత్, అదెపు శ్రీనివాస్  సింహం , మైసయ్య, తదితరులు పాల్గొన్నారు.

Read More డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్

Latest News

దుద్దులపల్లి గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభం దుద్దులపల్లి గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభం
జయభేరి, సైదాపూర్ : సైదాపూర్ మండల్ దుద్దనపల్లి గ్రామంలో శుక్రవారం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన విశాల సహకారం సంఘ అధ్యక్షులు కొత్త తిరుపతి రెడ్డి ప్రారంభించడం...
జ్యోతిరావు పూలే జయంతి...
గౌడవల్లిలో కుక్కల స్వైర విహారం
జై బాపు -జై భీమ్ -జై సంవిధాన్ అభియాన్
జోరుగా మట్టి దందా... బేస్ మెంట్ పేరిట మట్టి విక్రయాలు...
"వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్" బ్రాండ్ అంబాసిడర్‌గా : ప్రొఫెసర్ యుద్ధవీర్ కట్టా