ఎమ్మెల్సీ రామచంద్రారావును సన్మానించిన మేడ్చల్ జిల్లా బిజెపి అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి గెలుపునకు అందరు కృషి చేయాలన్న ఎమ్మెల్సీ రామచంద్రారావు

ఎమ్మెల్సీ రామచంద్రారావును సన్మానించిన మేడ్చల్ జిల్లా బిజెపి అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్

జయభేరి, ఫిబ్రవరి 7:
కరీంనగర్ లో నిర్వహించిన బిజెపి సమావేశానికి వెళ్తున్న ఎమ్మెల్సీ రామచంద్రారావును తూoకుంట మున్సిపాలిటీ లోని దొంగల మైసమ్మ చౌరస్తా వద్ద బిజెపి జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా కలిసి అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్సీ రామచంద్రారావు మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలో బిజెపి రోజురోజుకు  అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో  పటిష్టంగా తయారవుతుందని తెలిపారు. అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి గెలుపునకు అందరు కలిసి కట్టుగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తూంకుంట మున్సిపాలిటీ అధ్యక్షులు నర్సింహా రెడ్డి, శామీర్ పేట మండల అధ్యక్షులు కొరివి కృష్ణ ముదిరాజ్, స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Latest News

జ్యోతిరావు పూలే జయంతి... జ్యోతిరావు పూలే జయంతి...
సామాజిక సమానత్వానికి, మహిళా విద్యకు మార్గదర్శకులు జ్యోతిరావు పూలే. అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త  జ్యోతిరావు...
గౌడవల్లిలో కుక్కల స్వైర విహారం
జై బాపు -జై భీమ్ -జై సంవిధాన్ అభియాన్
జోరుగా మట్టి దందా... బేస్ మెంట్ పేరిట మట్టి విక్రయాలు...
"వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్" బ్రాండ్ అంబాసిడర్‌గా : ప్రొఫెసర్ యుద్ధవీర్ కట్టా 
తాటికల్ ఇసుక రీచ్ బంద్ చేయాలని ఆర్డీవోకు వినతి