జై బాపు -జై భీమ్ -జై సంవిధాన్ అభియాన్
రెండవ రోజు రాజ్యంగా పరిరక్షణ పాదయాత్ర
జయభేరి, సైదాపూర్ : ఆఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన మేరకు.. రెండవ రోజు రాజ్యంగా పరిరక్షణ పాదయాత్ర లో భాగంగా.. జై బాపు -జై భీమ్ -జై సంవిధాన్ అభియాన్ రాజ్యంగా పరిరక్షణ కై గ్రామ గ్రామాన పాదయాత్రలో భాగంగా సైదాపూర్ మండల కేంద్రంలోని దుద్దెనపల్లి గ్రామంలో స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
సామాజిక న్యాయం, నిరుద్యోగ సమస్యలు, రైతుల సమస్యలు, మహిళా సాధికారత, విద్య, ఆరోగ్యం, పౌర హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు మాజీ ZPTC బత్తిని శ్రీనివాస్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండారపు శ్రీనివాస్, కూతురు విద్వాన్ రెడ్డి, మ్యాకల రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మిట్టపల్లి కిష్టయ్య, AMC వైస్ చైర్మన్ న్యాదెండ్ల రాజ్ కుమార్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు వేముల సాయికుమార్, వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, AMC డైరెక్టర్లు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియా వారియర్స్, నాయకులు, అనుబంధ సంఘాలు పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..
Post Comment