మల్లారెడ్డి ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేయాలి
మేడ్చల్ జోన్ డీసీపీకి ఫిర్యాదు చేసిన టీయూడబ్ల్యూజే నేతలు
మల్లారెడ్డి వార్తలు బైకట్ చేద్దాం... టీయూడబ్ల్యూజే (ఐజెయు) మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు గడ్డమీద బాలరాజు
జయభేరి, మేడ్చల్ : జర్నలిస్టులపై దాడులకు తెగబడిన మల్లారెడ్డి ఆసుపత్రి యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(ఐజెయు) మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాలరాజు తెలిపారు.
నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రి ఆవరణలో బౌన్సర్లను నియమించి రోగులను, బంధువులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లారెడ్డి తన పలుకుబడిన ఉపయోగించి విద్య, వైద్య రంగంలో అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మీడియా జోలికొస్తే మల్లారెడ్డిని వదిలిపెట్టే సమస్య లేదని హెచ్చరించారు. తాను ఏం చేసినా చెల్లుతుందని భావిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులను ఏకం చేసి ఆందోళన చేపడతామన్నారు.
మల్లారెడ్డికి సంబంధించిన రాజకీయ, విద్య, ఆస్పత్రి లకు సంబంధించిన వార్తలను బైకట్ చేయాలని మేడ్చల్ జిల్లా జర్నలిస్టులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా డిసిపి కోటిరెడ్డి మాట్లాడుతూ సమగ్ర విచారణ జరిపించి యాజమాన్యంపై కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా వైద్య అధికారులను ఆస్పత్రిలో బౌన్సర్ల విషయమై వివరణ తీసుకొని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా చూస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు దయాకర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, శివాజీ, జనార్దన్ రెడ్డి, కృష్ణారెడ్డి, కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కోటగడ్డ శ్రీనివాస్, కార్యదర్శి సాయిబాబా, కోశాధికారి శేషారెడ్డి, నాయకులు రాజేందర్, రాజు, ప్రవీణ్, సంతోష్, మాధవ రెడ్డి, బాధిత జర్నలిస్ట్ లు తదితరులు పాల్గొన్నారు.
Post Comment