శ్రీ గౌరీ అవతారంలో అమ్మవారు 

సకల విద్యా స్వరూపిణి... శ్రీ విద్యా సరస్వతి మాత 

శ్రీ గౌరీ అవతారంలో అమ్మవారు 

జయభేరి, గజ్వేల్, అక్టోబర్ 06 :
సకల విద్యలకు సరస్వతి దేవి అధిష్టాన దేవతగా,జ్ఞాన ప్రధాతగా అమ్మవారు ఆదివారం శ్రీ గౌరీ అవతారంలో భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు. ప్రసిద్ధ వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్రంలో శరన్నవరాత్ర మహోత్సవాలు క్షేత్ర వ్యవస్థాపక చైర్మన్ ప్రముఖ వాస్తు సిద్ధాంతి బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ నేతృత్వంలో వైభవోపేతంగా జరుగుతుండగా, ఈ పర్వదినాల్లో అమ్మవారిని దర్శించుకుంటే బుద్ధి, విజ్ఞానం, చక్కటి విద్య ప్రసాదిస్తుందని, ఆ కుటుంబానికి అంతా మంచే జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకమని సిద్ధాంతి చంద్రశేఖర శర్మ ఉద్ధోదించారు. 

కాగా తెల్లవారుజామున వేద పండితుల మంత్రోశ్చరణల మధ్య అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం, గణపతి పూజ, పుణ్యహవాచనము, మహాభిషేకము, కలశ స్థాపన, ఛతుషష్టు పచారపూజ, మూలమంత్ర హవనము, చండీ హోమము, శ్రీ చక్ర పూజ, చిన్నారులకు అక్షర స్వీకారం, అన్నప్రాసన తదితర కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అయితే శరన్నవరాత్ర పర్వదినాలతోపాటు ఆదివారం కలిసి రావడంతో భక్తులు క్షేత్రానికి పోటెత్తగా, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ముందస్తు ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలతో పాటు మహాప్రసాదం అందజేశారు.

Read More ప్రపంచం కమ్యూనిస్టుల వైపు చూస్తున్నది... 

8f5551e9-2c7e-4180-a2a5-1c530785d559

Read More ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎన్నిక