తెలంగాణలో సైకిల్ రిపేర్?
జయభేరి, హైదరాబాద్: జనవరి 04: సైకిల్ పంక్చర్ అయింది చైన్ కూడా తెగిపోయింది. ఎంత తొక్కినా ముందుకు కదలదనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. పడిలేచి న కెరటమై.. పోగొట్టుకున్న చోటే వెతుక్కునే ప్రయత్నం మొదలుపెట్ట బోతుందట తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు నైజాం గడ్డ మీద ప్రభంజనం సృష్టించిన టీడీపీ.. పూర్వవైభవం కోసం సరికొత్త వ్యూహాలు రెడీ చేస్తోందట. సైకిల్ పార్టీ తెలంగాణలో మళ్లీ సవారీ చేయబోతుందా? తెలం గాణ గడ్డ మీద చంద్రబాబు వేస్తున్న స్కెచ్ ఏంటి?
తెలంగాణపై మళ్లీ ఫోకస్ పెట్టారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో డీలా పడ్డ పార్టీకి పూర్వవైభవం తెచ్చేలా అడుగులు వేస్తున్నారట. సంక్రాంతి తర్వాత పూర్తిస్థాయిలో తెలంగాణ మీదే నజర్ పెట్టబోతున్నారట.
జనవరి చివరి కల్లా తెలంగాణ టీడీపీ అధ్యక్ష నియామకం చేపట్టి, కార్యవర్గాన్ని ప్రకటించాలని భావిస్తున్నారట చంద్రబా బు. త్వరలో తెలంగాణలో జరగనున్న సర్పంచ్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే దిశగా తెలుగు దేశం పార్టీ అడుగులు వేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారట చంద్రబాబు. ఇందులో భాగంగా ప్రతీ 15-20 రోజులకు ఒకసారి హైదరాబాద్‌లో నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు.
కాసాని జ్ఞానేశ్వర్ రాజీనా మా, తర్వాత తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడు లేకుం డా పోయారు. అందుకే ఇంకా ఆలస్యం చేయకుం డా టీటీడీపీకి వెంటనే అధ్యక్షుడిని నియమించ డంతో పాటు పూర్తిస్థాయి లో కార్యవ ర్గాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట.
సంక్రాంతి తర్వాత తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి నియామకం..?
సంక్రాంతి పండగ తర్వాత తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ని, నియమిస్తారని టాక్. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు సాగుతుండగా, జనవరి మూడో వారంలో తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారని తెలుస్తోంది.
Post Comment