నీ తాటాకు చప్పులకు భయపడేది లేదు రేవంత్ రెడ్డి

హరీష్ రావుకు కేసులు కొత్తేం కాదు... ఎన్ని కేసులు పెట్టినా భయపడే నాయకులం కాదు... గజ్వేల్ బిఆర్ఎస్ ఇంచార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి

నీ తాటాకు చప్పులకు భయపడేది లేదు రేవంత్ రెడ్డి

జయభేరి, గజ్వేల్, డిసెంబర్ 04 :
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పై కక్షపూరితంగా కుట్రపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ కేసులు పెట్టడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రతాపరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...  మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఎఫ్ఐఆర్లో బుక్ చేపించిన మీరు చేస్తున్న మోసాలను ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రజలకు ఇచ్చిన ఆరు అమలు కాని గ్యారెంటీలపై అడుగడుగున ప్రశ్నిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మెడలూవంచేదాకా పోరాడుతామని వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. 

గతంలో చక్రధర్ గౌడ్ నా ఫోన్ టాపింగ్ అయిందని హరీష్ రావు పై జూన్ 19వ తారీఖున డిజిపికు ఫిర్యాదు చేశారని అనంతరం నిజ నిజాలు తెలుసుకొని తాను ఫిర్యాదులో నిజం లేదని భావించి నవంబర్ 22వ తేదీన చక్రధర్ గౌడ్ తన పిటీషన్ను ఉపసంహరించుకున్నారు.కానీ నేడు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాల పాడుతూ పాత కేసులను లేవనెత్తుతున్నారని రేవంత్ రెడ్డి పై ప్రతాప్ రెడ్డి ఫైర్ అయ్యారు.గతంలో ఇలానే అవాకుల చవాకులు లేని మాటలు మోసపూరితమైన మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే తెలంగాణ ప్రజలు ఎక్కడ తరిమికొడతారని తుపాకిని దగ్గర పెట్టుకొని తిరిగిన చరిత్ర రేవంత్ రెడ్డి అని వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు.ప్రజల మధ్యల తిరిగిన చరిత్ర హరీష్ రావుది అన్నారు.

Read More నేత్రపర్వం నాచగిరి క్షేత్రం...

ప్రజా క్షేత్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు పెట్టడాన్ని వంటేరు ప్రతాప్ రెడ్డి ఖండిస్తూ రేవంత్ రెడ్డి పై మండిపడ్డారు.కేసులు పెట్టి భయపెట్టియడం పిరికిపందల చర్య అని వంటెరు ప్రతాప్ రెడ్డి అన్నారు. ఇది రేవంత్ నిరంకుశ వైఖరునికి నిదర్శనమని అన్నారు. హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా ఉంటే నిద్ర పట్టక ఎక్కడ కాంగ్రెస్ కోట కదులుతుందో అని భయపడి హరీష్ రావు పై కేసులు పెట్టిస్తున్నారని వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు.నీ అసమర్ధ పాలనతో ప్రజలు విసిగిపోయారని నువ్వు ముఖ్యమంత్రి కుర్చీకి సరిపోవని చిల్లర రాజకీయాలు చేస్తూ ముఖ్యమంత్రి అనే పదానికి మచ్చ తీసుకునే విధంగా చర్యలు ఉన్నాయన్నారు.

Read More రైతుబంధును బంజేసే కుట్ర: హరీశ్ రావు..!!

కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలపై కానీ ఆరు గ్యారెంటీ లపై ప్రజా క్షేత్రంలో హరీష్ రావు ప్రజా సమస్యలపై ఎప్పుడు పోరాడుతూనే ఉంటారని వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూస్తే ప్రజలు ఏదో రోజు నీ గొంతును నొక్కుతారని నీకు సరైన బుద్ధి చెబుతారని రేవంత్ రెడ్డి పై వంటేరు ప్రతాప్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నీ చిల్లర రాజకీయాలు మానుకొవలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.ముందు కేసు పెట్టించిన నీ చెంచా గాని నేర చరిత్రను నువ్వు తెలుసుకో రేవంత్ రెడ్డి అని రేవంత్ రెడ్డికి ప్రతాప్ రెడ్డికి ఎగ్దేవ చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కోకోకోల కంపెనీని తీసుకువచ్చారని అది అప్పుడు నిర్మాణంలో ఉందని వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు. 

Read More అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పీఏ పల్లి శాఖ ఆధ్వర్యంలో స్థానిక స్థానిక ఆదర్శ పాఠశాల ముందు ధర్నా

ఈరోజు అత్త సొమ్మును అల్లుడు దానం చేసినట్టుగా రెడ్డి కోకోకోలా కంపెనీని ప్రారంభించి నేనే పరిశ్రమలను తీసుకువస్తున్నానని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు.రుణమాఫీ పూర్తి చేసే 49 వేల కోట్ల రూపాయలు అవుతాయి కానీ రేవంత్ రెడ్డి కేవలం 20వేల కోట్లు మాత్రమే మాత్రమే రుణమాఫీ చేసి దాదాపు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయకుండా ఎగనామాలు పెడుతున్నారని వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు.అసమర్ధుడైన రేవంత్ రెడ్డి సమర్ధుడైన హరీష్ రావు పై తప్పుడు కేసులు వేస్తున్నారని మండిపడ్డారు.దాదాపు సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి లక్ష కోట్ల రూపాయల అప్పు చేసిన ఘనుడని వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు. 

Read More తుర్కపల్లి లో 6 పడకల ఆసుపత్రి ప్రారంభం

అప్పు చేసిన లక్ష కోట్ల రూపాయలను రేవంత్ రెడ్డి ఏ పథకానికి వినియోగించారో ప్రజలకు సమాధానం చెప్పాలని వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి మండల పార్టీ అధ్యక్షుడు బండే మధు పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా గజ్వేల్ మాజీ జెడ్పిటిసి పంగా మల్లేశం, వైస్ చైర్మన్ జక్యూద్దీన్, సర్పంచులు దయాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి కౌన్సిలర్లు బొగ్గుల చందు,  నాయకులు శ్రీనివాస్, ఉమర్ అహ్మద్ స్వామి చారి కటిక శ్రీనివాస్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులున్నారు.

Read More ప్రజా పాలనపై కళాయాత్ర ప్రదర్శనలు

Latest News

విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
జయభేరి, మేడిపల్లి : రాచకొండ పోలీస్ కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుడమి హై స్కూల్ బోడుప్పల్ లో మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్...
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు