ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు
జయభేరి, మేడ్చల్ :
తెలంగాణ ప్రజల ఆకాంక్షను సఫలం చేస్తూ ప్రత్యేక రాష్టాన్ని ఇచ్చిన తల్లి సోనియాగాంధీ అని గుండ్లపోచంపల్లి కాంగ్రెస్ అధ్యక్షుడు కౌన్సిలర్ సాయిపేట శ్రీనివాస్ అన్నారు. సోమవారం శ్రీమతి సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి సోనియాగాంధీ కి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం అయ్యిందాని, రైతు రుణమాఫీ హమీ సైతం దాదాపుగా పూర్తయ్యింది. రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ సైతం అమలవుతోందాని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ సర్పంచ్ లు భేరి ఈశ్వర్, కందాడి నరేందర్ రెడ్డి, రవీందర్ గౌడ్, నాయకులు మారేపల్లి సుధాకర్, ఫిలిప్స్, శ్రీనివాస్ రెడ్డి, బాపురెడ్డి, కృష్ణారెడ్డి, రాజేందర్, మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేశ్ ముదిరాజ్, సంపత్ యాదవ్, ఉదయ్ గౌడ్, సంపత్ గౌడ్, మాధవ్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Post Comment