ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎన్నిక
జయభేరి, గజ్వేల్, డిసెంబర్ 04 :
గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ప్రజా పాలన సంబరాలు కార్యక్రమంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, గజ్వేల్ కోఆర్డినేటర్ పారిజాత, నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులను ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రజ్ఞాపూర్ నాలుగో వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యులుగా ఈదుగాని శివులు శిర్ల కృష్ణ కొల్లూరి సత్యనారాయణ సోం నాగరాణి దామర్ కుంట సుష్మ నియామకమయ్యారు.
అంతేకాకుండా గత పది సంవత్సరాలలో ఏ ఒక్కరికి కూడా ఇల్లు లేని వారికి ఏ ఒక్క రూపాయి కూడా సహాయం చేయని ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అవహేళన చేస్తూ ప్రజలకు అందకుండా అడ్డుపడుతున్నారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. వారి తపనంత రాబోయే స్థానిక సంస్థల్లో నాలుగు ఓట్ల కోసం నానా ఆగమ చేస్తున్నారు కానీ రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు నర్సా రెడ్డి ఆదేశాల మేరకు నర్సారెడ్డి ఆధ్వర్యంలో ప్రజలందరికీ అందేవిధంగా పనిచేస్తాం స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతాం మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం అని తెలిపారు.
Post Comment