డిసెంబర్ 2 నుంచి 28వ తేదీ వరకూ గ్రామ, వార్డు సచివాలయాల్లో నూతన రేషన్ కార్డులకు దరఖాస్తులు

డిసెంబర్ 2 నుంచి 28వ తేదీ వరకూ గ్రామ, వార్డు సచివాలయాల్లో నూతన రేషన్ కార్డులకు దరఖాస్తులు

జయభేరి : ఏపీ ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనుంది.

ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు ఇతర సర్వీసులకు కూడా అవకాశం కల్పించనుంది. డిసెంబర్ 2 నుంచి 28వ తేదీ వరకూ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇందుకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించనుంది. మార్పులు, చేర్పులు చేసిన కార్డులు, కొత్త కార్డులన్నింటినీ.. సంక్రాంతి 2025 కానుకగా లబ్ధిదారులకు అందించేలా ప్లాన్ చేసింది.

Read More వరద బాధితుల సహాయార్థం సేకరించిన విరాళాలు 

గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో.. కొత్తగా పెళ్లిళ్లు అయినవారు, రాజకీయాల కారణాలతో రేషన్ కార్డులు రానివారు వేల సంఖ్యలో ఎదురుచూస్తున్నారు. కొత్త రేషన్ కార్డులు, కార్డుల్లో మార్పులు, సభ్యుల తొలగింపు.. ఇలా అన్నీ కలిపి ప్రస్తుతం 3,36,72000 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. కొత్త దరఖాస్తులతో పాటు వీటిని కూడా పరిశీలించి కొత్త రేషన్ కార్డు్ల్ని అందించనుంది కూటమి ప్రభుత్వం.

Read More 11 నుంచి ఏపీ బడ్జెట్ భేటీ

Latest News

ములుగు జిల్లా చల్పాక ఎన్ కౌంటర్ పై హైకోర్టులో నేడు విచారణ! ములుగు జిల్లా చల్పాక ఎన్ కౌంటర్ పై హైకోర్టులో నేడు విచారణ!
హైదరాబాద్, డిసెంబర్ 02 : ములుగు జిల్లా చల్పాక దగ్గర అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టు లకు మధ్య ఎదురు కాల్పులు...
రైతుబంధును బంజేసే కుట్ర: హరీశ్ రావు..!!
డిసెంబర్ 2 నుంచి 28వ తేదీ వరకూ గ్రామ, వార్డు సచివాలయాల్లో నూతన రేషన్ కార్డులకు దరఖాస్తులు
యువత ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చాక కాకుండా ముందు నుండే సిద్ధంగా ఉండాలి...
ప్రపంచం కమ్యూనిస్టుల వైపు చూస్తున్నది... 
రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు  కలెక్టర్