తుర్కపల్లి లో 6 పడకల ఆసుపత్రి ప్రారంభం
ఆరోగ్య తెలంగాణే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం - టీ పీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేశ్ యాదవ్
జయభేరి, డిసెంబర్ 4:
ఆరోగ్య తెలంగాణే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని టీ పిసిసి ఉపాధ్యక్షుడు , మేడ్చల్ అసెంబ్లీ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ తోటకూర వజ్రేశ్ యాదవ్ అన్నారు. శామీర్ పేట మండలం తుర్కపల్లి గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఏర్పాటు చేసిన 6 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని మాజీ సర్పంచ్ జీడిపల్లి కవిత వేణుగోపాల్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ నాయకులు ఉద్దమర్రీ నర్సింహా రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్డన్ రెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింలు యాదవ్, తూoకుంట మున్సిపల్ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి, మేడ్చల్ మండల అధ్యక్షులు రమణరెడ్డి, మూడుచింతలపల్లి మండల మాజీ వైస్ ఎంపిపి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి శామీర్ పేట మండల మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Post Comment