విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి

విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి

జయభేరి, గజ్వేల్, డిసెంబర్ 04 :
విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందిన ఘటన గజ్వేల్ పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రానికి చెందిన వరంజిత్ అనే చిరు వ్యాపారి గజ్వేల్ పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్ సమీపంలో రోడ్డు ప్రక్కన పానీ పూరీ బండి నడుపుతూ కొన్నేళ్లుగా జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే పక్కనే ఉన్న మెడికల్ షాప్ లో నుండి తన పానీ పూరీ బండికి విద్యుత్ సరఫరా కనెక్షన్ తీసుకుని బల్బ్ వెలిగించుకున్నాడు. 

తన బండి సమీపంలో పానీ పూరీకి సంబంధించిన పనిమూట్లను నీళ్లతో శుభ్రపర్చుకోగా నేల మొత్తం తడిసిపోయింది. పానీ పూరీ బండికి వస్తున్న విద్యుత్ సరఫరాను ఆపివేయకుండానే తడిసిన నేలపై నిలబడి తడిసిన చేతులతోనే ప్లగ్ తీయడంతో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న గజ్వేల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

Read More మేడ్చల్ లో కీచక పోలీస్

Latest News

గౌడవల్లిలో కుక్కల స్వైర విహారం గౌడవల్లిలో కుక్కల స్వైర విహారం
జయభేరి, మేడ్చల్ : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో వీధికుక్కలు ప్రజలను తీవ్రభయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. పగలురాత్రి తేడా లేకుండా గుంపులు, గుంపులుగా రోడ్లపై తిరుగుతూ చిన్న పిల్లలు, మహిళలు,...
జై బాపు -జై భీమ్ -జై సంవిధాన్ అభియాన్
జోరుగా మట్టి దందా... బేస్ మెంట్ పేరిట మట్టి విక్రయాలు...
"వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్" బ్రాండ్ అంబాసిడర్‌గా : ప్రొఫెసర్ యుద్ధవీర్ కట్టా 
తాటికల్ ఇసుక రీచ్ బంద్ చేయాలని ఆర్డీవోకు వినతి
ముస్లిం లందరికీ ఇఫ్తార్ విందు