ఏఐసీసీ నేతలను కలిసిన బండారు శ్రీకాంత్ రావు ...

ఏఐసీసీ నేతలను కలిసిన బండారు శ్రీకాంత్ రావు ...

జయభేరి, గజ్వేల్, జనవరి 09 :
గాంధీభవన్ లో ఏఐసిసి నేతలను టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు గురువారం టిపిసిసి  కార్యాలయం లో కలిశారు. ఈ సందర్భంగా వారు ఏఐసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ కేసీ వేణుగోపాల్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షిలను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగె గజ్వేల్ నియోజకవర్గంలో పార్టీ పటిష్టత కోసం తీసుకోవాల్సిన చర్యల పైన చర్చించినట్లు బండారు శ్రీకాంత్ రావు తెలిపారు.