వ్యాయామ ఉపాధ్యాయుడు కర్రలతో వాతలు...!
- విద్యార్థులను పరామర్శించిన సిద్దిపేట జడ్జి స్వాతి రెడ్డి..
- తగిన చర్యలు తీసుకుంటాం స్వాతి రెడ్డి...
- వ్యాయామ ఉపాధ్యాయుని సస్పెండ్ చేయాలి వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్..
జయభేరి, కొండపాక, జనవరి 09 :
ఓ వైపు ప్రభుత్వం పేద విద్యార్థులకు గురుకులాలు,వసతి గృహాల్లో అన్ని రకాల విద్యలను నేర్పిస్తూ,నాణ్యమైన విద్యాబుద్ధులు నేర్పించాలని నిర్ణయాలు తీసుకుంటుండగా ఉపాధ్యాయులు మాత్రం ప్రభుత్వ నిర్ణయాలకు భిన్నంగా తమకేం పట్టడాన్నట్లుగా వ్యవహరిస్తూ విద్యార్థులను చితకబాదుతున్నారు, అన్యం పుణ్యం తెలియని విద్యార్థులపై దాడులు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న ఘటన కొండపాక మండల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది.
ఈ సందర్భంగా న్యాయ మూర్తి మాట్లాడుతూ విద్యార్థులపై ఇలాంటి దాడులు బాధాకరమన్నారు, అలాగే పాఠశాలలోని బాత్రూంలు అపరిశుభ్రంగా ఉన్నాయని పేర్కొన్నారు,ఈ దాడికి పాల్పడిన వ్యాయామ ఉపాధ్యాయున్ని విధుల నుండి తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు,అయితే ఇందుకు కారణమైన ఉపాధ్యాయుడి పై ప్రభుత్వం న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి మరి.
మాజీ ఎఫ్డీసీ ప్రతాప్ రెడ్డి పరామర్శ...
కొండపాక సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ బాయ్స్ జూనియర్ కాలేజీలో పిడి ఫిజికల్ డైరెక్టర్ వాసు విద్యార్థులకు ఆటలు నేర్పించాల్సింది పోయి వారికి క్రమశిక్షణ నేర్పించాల్సింది పోయి, స్టడీ అవర్స్ కు ఆలస్యమయ్యారని సాకుతో సోయి లేకుండా, మానవత్వం లేకుండా రాక్షసుని మాదిరిగా వ్యవహరించి దాదాపు 30 మంది విద్యార్థులను గొడ్లను బాదినట్టు బాది, విద్యార్థులను చితకబాది ఎక్కడ పడితే అక్కడ కొడితే విద్యార్థులకు వాతలు రావడం, ముగ్గురు విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగింది.
విషయం తెలుసుకున్న గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఇంచార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి కొండపాక లోని సోషల్ వెల్ఫేర్ బాలుర రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీనీ సందర్శించి విద్యార్థుల నుంచి నిన్న జరిగిన ఘటన విషయాలు తెలుసుకొని విద్యార్థులను వంటేరు పరామర్శించడం జరిగింది.ఈ సందర్భంగా వంటేరు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి విద్యార్థులను పైశాచికంగా నిర్దాక్షిణ్యంగా చితకబాదిన విద్యార్థులను పీడీ వాసుపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయించి ఫిజికల్ డైరెక్టర్ వాసును ఉద్యోగం నుండి సస్పెండ్ చేయాలని వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు.
Post Comment