ఆసుపత్రిలలో సేవాభావంతో  వైద్య సిబ్బంది పనిచేయలి

ఎంపీపీ అధ్యక్షతలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశము

ఆసుపత్రిలలో సేవాభావంతో  వైద్య సిబ్బంది పనిచేయలి

జయభేరి, పరవాడ :
పరవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాడ చీపురుపల్లి, పరవాడ పి.హెచ్.సి. లు సంయుక్తంగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశము ఆసుపత్రి అభివృద్ధి చైర్మన్ ఎం.పీ.పీ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భముగా ఎంపీపీ పైల వెంకట పద్మాలక్ష్మి మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా సిబ్బంది అందరూ సేవాభావంతో లక్ష్యంగా వైద్య సేవలు అందించాలని అన్నారు. 

ఆసుపత్రికి కిటికీలు మెస్సలు, తలుపులకు రిపేర్లు, బయో మెడికల్ వేస్టేజ్ కవర్స్, ఓ.పి స్లిప్స్ ప్రింటింగ్,మొదలుగునవి ఆసుపత్రి రోగులకు అవసరమైనవి ఏమైనా ఉన్నట్లయితే కొనుగోలు చేయవలెను.ఆసుపత్రి  ముందు గేటు దగ్గర,లోపల గ్రావెల్ వేయడానికి పేషెంట్స్ కూర్చోవడానికి షెడ్డు సిమెంట్ బెంచీలు, మొదలగు అవసరాలను గుర్తించి నివేదిక పంపించమని ఆమె తెలియజేశారు. ఆసుపత్రికి  ఏ వ్యాధితో ఎక్కువ మంది వస్తున్నారు దాని తగ్గట్లు మందులను అందుబాటులో ఉంచుకోవాలని  రోగులకు సేవ దృక్పథంతో వైద్య సేవలు అందించాలని సూచనలు చేశారు.

Read More 7న మద్యం షాపుల బంద్

ఈ సమావేశంలో పరవాడ సర్పంచ్ ఎస్.అప్పలనాయుడు,ఎంపీటీసీ పైల శ్రీనివాస్, భరణికం సర్పంచ్ కె.పూజ, ఎమ్మార్వో బి. వి. అంబేద్కర్, డాక్టర్. పి.హారిక, డాక్టర్.జయశ్రీ కరిష్మా డాక్టర్. క్రాంతి కుమార్,  తదితరులు పాల్గొన్నారు.

Read More పేరుకే ప్రభుత్వ అస్పత్రి.. పైన పటారం లోన లొటారం