భారత్ ఖాదీ క్యాలండర్ ఆవిష్కరించిన ఎన్ సీ సంతోష్

భారత్ ఖాదీ క్యాలండర్ ఆవిష్కరించిన ఎన్ సీ సంతోష్

జయభేరి, గజ్వేల్, జనవరి 09 : 
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో గురువారం సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు  ఎన్ సీ సంతోష్ చేతుల మీదుగా భారత్ ఖాదీ క్లాత్ స్టోర్ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎన్ సీ సంతోష్ మాట్లాడుతూ భారత్ ఖాదీ క్లాస్ స్టోర్ యజమాని నరేందర్ రెడ్డిని అభినందించారు. వినియోగదారుల మన్నన పొందుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్న భారత్ ఖాదీ క్లాత్ స్టోర్ మంచి గుర్తింపు పొందిందని, యువత వ్యాపారంలో రాణించాలని ఉద్దేశంతో సొంతగా వ్యాపారాన్ని కొనసాగిస్తూ పదిమందికి ఉపాధి కల్పిస్తున్న నరేందర్ రెడ్డి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి, ఆరిఫ్, బ్రాహ్మణపల్లి బిక్షపతి, బాలేష్, సతీష్,మహేందర్ తదితరులు పాల్గొన్నారు

Read More అటానమస్ వల్ల సలహాలు సూచనలు కావాలి...