చింతపల్లిలో రెండు రోజులపాటు జరిగిన బ్లాక్ స్థాయి క్రీడా పోటీలు

చింతపల్లిలో రెండు రోజులపాటు జరిగిన బ్లాక్ స్థాయి క్రీడా పోటీలు

జయభేరి, చింతపల్లి :
భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు , క్రీడల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం వారి సౌజన్యంతో చైతన్య మహిళా మండలి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల చింతపల్లి గ్రౌండ్ నందు రెండు రోజులపాటు జరిగిన బ్లాక్ స్థాయి క్రీడా పోటీలు ఈరోజు ముగిశాయి. 

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ బీ.ధనరాజ్  హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా కబడ్డీలో మొదటి బహుమతి, ద్వితీయ బహుమతి, వాలీబాల్ లో మొదటి బహుమతి, ద్వితీయ బహుమతి, రన్నింగ్ 100  మీటర్లు మొదటి బహుమతి, 200 మీటర్లు మొదటి బహుమతి, షటిల్ మొదటి బహుమతులు గెలుపొందిన వారికి అందించి క్రీడ సామాగ్రి కూడా అందించడం జరిగింది.

Read More ఎంజెపి లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ధనరాజ్ మాట్లాడుతూ ప్రస్తుత ఒత్తిడితో కూడుకున్న జీవితంలో యువత మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండడానికి క్రీడలు ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం బాధ్యులు కొండా నాయక్, కిరణ్ కుమార్, కళాశాల అధ్యాపకులతో పాటు వివిధ యూత్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Read More అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పీఏ పల్లి శాఖ ఆధ్వర్యంలో స్థానిక స్థానిక ఆదర్శ పాఠశాల ముందు ధర్నా