ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించండి పర్యావరణాన్ని కాపాడండి 

ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించండి పర్యావరణాన్ని కాపాడండి 

జయభేరి, పరవాడ :
జీవీఎంసీ 79 వా వార్డులో పరిధిలో కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ ఆధ్వర్యంలో షాప్ యజమానులకు సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రౌతు మాట్లాడుతూ ప్లాస్టిక్ ను వాడవద్దని దానికి బదులుగా స్టీల్ బాక్సులు ఉపయోగించాలని, ప్లాస్టిక్ వలన క్యాన్సర్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు సిబ్బంది,సచివాలయ సిబ్బంది డ్వాక్రా ఆర్పీలు, స్థానిక గ్రామ పెద్దలు నాయకులు పాల్గొన్నారు.