సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమావేశం 

సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమావేశం 

జయభేరి, పరవాడ :
సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరవాడ మండలం నాయుడుపాలెం పంచాయతీ గ్రామంలో శ్రీ సిద్ధి వినాయక దేవాలయం కేంద్రంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పరవాడ సబ్ డివిజన్ ధర్మప్రచారక్ వెన్నల అప్పలనాయుడు మాట్లాడుతూ 10 వ తేదీ వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం దర్శనం చేసుకోవడం వల్ల సాక్షాత్తు శ్రీ మహా విష్ణువే వాచి ఆశీర్వదించి నట్లు భావన, ఈనెల లో 10 తేదీన నుంచి 26 తేదీ వరకు భారతమాత పూజ ప్రతి దేవాలయ కేంద్రంగా గ్రామ ధార్మిక జట్టు అందరూ కలిసి భారత మాత పూజ చేయాలి. 

ప్రతి గ్రామంలో భారత మాత పూజ చేయాలి. 12 వ తేదీన స్వామి వివేకానంద జయంతి 10 గ్రామంలో దేవాలయ కేంద్రంగా చేయాలి. ఇంకా జరగని కొన్ని గ్రామంలో మేలుకొలుపు కార్యక్రమం రెండు మూడు రోజులైనా ప్రారంభించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాతృమూర్తులు, కూండ్రపు నర్సింహమూర్తి, కడిమి శెట్టి శ్రీనివాసరావు, పైడిరాజు, అప్పలనాయుడు, నారాయణరావు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Read More తెలంగాణ మంత్రికి వైసీపీ కీల‌క నేత కౌంట‌ర్