అటానమస్ వల్ల సలహాలు సూచనలు కావాలి...

స్వయం ప్రతిపత్తి హోదా కు సహకరించిన వారికి సన్మానం...

అటానమస్ వల్ల సలహాలు సూచనలు కావాలి...

జయభేరి, గజ్వేల్, జనవరి 09:
గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బాలుర సముదాయమునకు స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నిఖత్ అంజుం , ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ వెంకటేష్, అకడమిక్ కోఆర్డినేటర్ కెప్టెన్ డాక్టర్ భవాని ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి కలిసి అటానమస్ విషయాన్ని వివరించి తగిన సలహాలు కోరడం జరిగింది. 

అదే విధంగా సహకరించిన కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ లోని మల్టి జోన్ టూ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజేందర్ సింగ్, మల్టి జోన్ వన్ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ యాదగిరి మరియు అకడమిక్ గైడెన్స్ ఆఫీసర్ ప్రొఫెసర్ బాల భాస్కర్ ని కలిసి కృతజ్ఞతలు తెలపడం జరిగింది.

Read More క్రియాశీల సభ్యత్వం పొందిన దయాకర్ రెడ్డి