సమాచార హక్కు చట్టం రక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన ఎంపీ, ఎమ్మెల్యే.

సమాచార హక్కు చట్టం రక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన ఎంపీ, ఎమ్మెల్యే.

జయభేరి, దేవరకొండ :
దేవరకొండ నియోజకవర్గం డిండి మండల కేంద్రంలో గురువారం నాడు దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి లు సమాచార హక్కు చట్టం రక్షణ సమితి నూతన క్యాలెండర్ ను సభ్యులతో కలిసి ఆవిష్కరించారు.

అనంతరం రాష్ట్ర అధ్యక్షులు కొర్ర కిషన్ నాయక్ మాట్లాడుతూ... సమాచార హక్కు చట్టం యొక్క ప్రాథమిక లక్ష్యం పౌరులకు సాధికారత కల్పించడం, ప్రభుత్వ పనిలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడం, అవినీతిని అరికట్టడం  మన ప్రజాస్వామ్యాన్ని నిజమైన అర్థంలో ప్రజల కోసం పనిచేసేలా చేయడం  పాలనా సాధనాలపై అవసరమైన నిఘా ఉంచేందుకు పాలించిన వారికి ప్రభుత్వం మరింత జవాబుదారీగా ఉండేలా మెరుగ్గా అమర్చబడి ఉంటుంది. ప్రభుత్వ కార్యకలాపాల గురించి పౌరులకు తెలియజేయడానికి ఈ చట్టం బ్రహ్మాస్త్రం లా ఉంటుందని  అని ఆయన అన్నారు. వారితో పాటు కార్యవర్గ సభ్యులు ప్రకాష్, కాంగ్రెస్ నాయకులు రాజేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Read More గూగుల్ తో తెలంగాణ సర్కార్ ఒప్పందం