మల్లారెడ్డి మాటతీరు మార్చుకోవాలి

బిజెపి అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి

మల్లారెడ్డి మాటతీరు మార్చుకోవాలి

జయభేరి, మేడ్చల్ : మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధి పై ప్రశ్నించిన బిజెపి నాయకులపై మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాటతీరు మార్చుకోవాలని మేడ్చల్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి అన్నారు.

శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... గురువారం మేడ్చల్ పట్టణంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన మల్లారెడ్డిని బిజెపి నాయకులు ఎమ్మెల్యేగా మేడ్చల్ ప్రాంతానికి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని నిలదీయగా వారిపై ఎమ్మెల్యే దురుసుగా మాట్లాడటం సమంజసం కాదన్నారు. మల్లారెడ్డి గత పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి మేడ్చల్ లో చేసిన అభివృద్ధి ఏమి లేదని, మల్లారెడ్డి సొంత వ్యాపారాలపై ఉన్న శ్రద్ధ అభివృద్ధి పై లేదని మోహన్ రెడ్డి విమర్శించారు.

Read More ఎంజెపి లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

ప్రజలు అభివృద్ధి పై ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తే ఓపికతో జవాబు చెప్పాలి కానీ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాత్రం బుతులతో సమాధానం చెప్పడం సిగ్గుచేటన్నారు. పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న మేడ్చల్ కు పూర్తిస్థాయిలో ఇ.ఎస్.ఐ హాస్పిటల్ సొంత భవనం ఏర్పాటు చేయలేదని గుర్తు చేశారు. మల్లారెడ్డి ఇప్పటికైనా తన తీరు మార్చుకోవాలని లేదంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని మోహన్ రెడ్డి హితవుపలికారు.

Read More ఈనెల 25న జరిగే రవీంద్ర భారతిలో బీసీల సమరభేరిని విజయవంతం చేయండి

Latest News