ఇన్ని సంవత్సరాలకు గెట్ టుగెదర్ కార్యక్రమం నిర్వహించుకోవడం సంతోషంగా ఉంది...

ఒక చెట్టుకు పూసిన పువ్వులం కాదు ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలము కాదు.

అయినా ఆత్మీయనురాగాలను పంచుకున్న మా బంధం స్నేహబంధం.

ఇన్ని సంవత్సరాలకు గెట్ టుగెదర్ కార్యక్రమం నిర్వహించుకోవడం సంతోషంగా ఉంది...

జయభేరి, దేవరకొండ : పట్టణంలోని స్థానిక జడ్.పి.హెచ్.ఎస్ బాలికల పాఠశాలలో 1981-82 సంవత్సరం పదవ తరగతి  బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు.

పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాలకు మేము స్నేహితులందరము కలిసి చదువుకున్న పాఠశాలలో ఈ గెట్ టు గెదర్  ప్రోగ్రాం నిర్వహించుకోవడం, పాత రోజులను, సంతోషకరమైన, బాధాకరమైన, విషయాలను, గుర్తుచేసుకొని మాట్లాడుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా తాము చదివిన పాఠశాల  అభివృద్ధి కొరకు పూర్వ విద్యార్థులందరూ కలిసి  55 వేల రూపాయలు విలువ గల కంప్యూటర్, ప్రింటర్  విరాళంగా అందించి తమ దాతృత్వాన్ని  చాటారు. 

Read More విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం

ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయురాలు బేరి రెబక మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండే తీపి జ్ఞాపకాలు చిన్నతనంలోనే ఉంటాయని, ఇక్కడ చదవిన విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి అత్యున్నత స్థానాల్లో స్థిరపడ్డారని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని, తల్లి,దండ్రులను అత్త,మామలను గౌరవించి వారి ఆశీస్సులను ఎప్పుడు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు బేరి రెబక,  జూనియర్ అసిస్టెంట్ రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా మొద్దునిద్ర వీడని రేవంత్ సర్కార్