బడులు, దేవాలయాలు సమీపంలో నో వైన్ షాప్: ఎక్సైజ్ కమిషనర్

పర్మిట్ రూమ్, బెల్ట్ షాప్ లకు పర్మిషన్ లేదు... ప్రతీ షాప్ లో రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి

బడులు, దేవాలయాలు సమీపంలో నో వైన్ షాప్: ఎక్సైజ్ కమిషనర్

జయభేరి, అమరావతి : ఏపీలో ఈనెల12 నుంచి కొత్త మద్యం విధానం అమలుకు ప్రయత్నిస్తామని ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ వెల్లడించారు. 'MRP కంటే అధిక రేటుకు విక్రయిస్తే చర్యలు తప్పవు.

పర్మిట్ రూమ్లు, బెల్ట్ షాపులకు అనుమతి లేదు. స్కూళ్లు, ఆలయాలకు వంద మీటర్ల పరిధిలో మద్యం షాపుల ఏర్పాటుకు అనుమతి లేదు. ప్రతి షాపులో 2 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. కొత్త విధానం అమల్లోకి వచ్చేవరకూ పాత విధానమే అమల్లో ఉంటుంది' అని ఆయన వెల్లడించారు.

Read More  వరద ప్రభావిత ప్రాంతాల్ల వారికి భరోసా..