అంతుచిక్కని రోజా వ్యూహం....

సోషల్ మీడియా అకౌంట్లలో వైసీపీ అధినేత జగన్‌ ఫొటోను… వైసీపీ పేరును రోజా తొలగించినట్లు ఇటీవల ప్రచారం జరిగింది. తమిళ రాజకీయాల్లోకి వెళ్లనున్నందునే ఆమె ఇలా జగన్‌ ఫొటోను తొలగించారని విమర్శలు వినిపించాయి. ఐతే తమిళ రాజకీయాల్లోకి వెళతానని తన ప్రత్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నారని చెబుతున్న రోజా…. తన సోషల్‌ మీడియా అకౌంట్ల నుంచి వైసీపీ, జగన్‌ ఫొటోను ఎందుకు తొలగించారో చెప్పకపోవడమే అనుమానాలను తావిస్తోందంటున్నారు.

అంతుచిక్కని రోజా వ్యూహం....

తిరుపతి, సెప్టెంబర్ 2 :
మాజీ మంత్రి రోజా పొలిటికల్‌ ఫ్యూచర్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైసీపీతో కటీఫ్‌కు సిద్ధపడుతున్నారనే ప్రచారాన్ని తాజాగా ఖండించిన రోజా… ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా సస్పెన్స్‌ కంటిన్యూ చేస్తున్నారని అంటున్నారు.

తన సోషల్ మీడియా అకౌంట్లలో వైసీపీ అధినేత జగన్‌ ఫొటోను… వైసీపీ పేరును రోజా తొలగించినట్లు ఇటీవల ప్రచారం జరిగింది. తమిళ రాజకీయాల్లోకి వెళ్లనున్నందునే ఆమె ఇలా జగన్‌ ఫొటోను తొలగించారని విమర్శలు వినిపించాయి. ఐతే తమిళ రాజకీయాల్లోకి వెళతానని తన ప్రత్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నారని చెబుతున్న రోజా…. తన సోషల్‌ మీడియా అకౌంట్ల నుంచి వైసీపీ, జగన్‌ ఫొటోను ఎందుకు తొలగించారో చెప్పకపోవడమే అనుమానాలను తావిస్తోందంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ మంత్రి రోజా దాదాపు రెండున్నర నెలలుగా సైలెంట్‌గానే ఉంటూ వస్తున్నారు. గుళ్లూ గోపురాల చుట్టూ తిరుగుతూ రాజకీయాలకు తనకు ఏం సంబంధం లేనట్లే వ్యవహరించారు. ఇదే సమయంలో తన సొంత నియోజకవర్గం నగరిలో పార్టీ నేతల నుంచి సహాయ నిరాకరణ ఎదుర్కొంటున్న రోజా…. పక్కనే ఉన్న తమిళనాడు రాజకీయాలపై ఫోకస్‌ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది.

Read More దువ్వాడ.. యుగపురుషడు... వైరల్ గా  మాధురి కామెంట్స్

రోజా తమిళ పాలిటిక్స్‌పై నెల రోజుల నుంచి ఉధృత ప్రచారం జరిగినా… ఆమె ఇన్నాళ్లు నోరు విప్పలేదు. గత వారం చెన్నైలో తమిళ పత్రిక ఇంటర్య్వూ ఇచ్చిన రోజా…. తనకు విజయ్‌ పార్టీలోకి వెళ్లాలనే ఆలోచన లేదని చెప్పారు. అయితే రోజా రాజకీయ ప్రస్థానంపై తెలుగునాట ప్రచారం జరిగితే.. ఆమె తమిళ గడ్డపై ఇంటర్వ్యూ ఇవ్వడంపైనా అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. తమిళనాడులో తన కోసం చర్చ జరిగేలా ఆమె ఆ ఇంటర్వ్యూ ఇచ్చారా? అంటూ రోజా ప్రత్యర్థులు ప్రశ్నించడం మొదలుపెట్టారు.

Read More భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొన్న ఎంపీపీ పైల, మాజీ సర్పంచ్ చుక్కా

దీంతో తాజాగా తిరుమల వచ్చిన రోజా పార్టీ మార్పుపై ఊహాగానాలను కొట్టిపడేశారు.మరోవైపు రోజా రాజకీయ ప్రత్యర్థులు మాత్రం… విమర్శల దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు. తమిళనాడులో విజయ్‌ పార్టీ నుంచి ఆహ్వానం లేకపోవడం వల్లనే ఆమె ఇప్పుడు యూటర్న్‌ తీసుకున్నారని మరో ప్రచారం తెరపైకి తెచ్చారు. నేను ఎక్కడికీ వెళ్లను మొర్రో అంటూ రోజా మొత్తుకున్న ఆమె ప్రత్యర్థుల విమర్శల వ్యూహం నుంచి తప్పించుకోలేకపోతున్నారు. రోజా ఏం చేసినా, అందులో రంధ్రాన్వేషణ చేస్తూ రాజకీయంగా ఆమెను ఇరుకున పెడుతున్నట్లు చెబుతున్నారు.

Read More గోదావరి పుష్కర ఏర్పాట్లు షురూ...

అధికార పార్టీకి టార్గెట్‌గా మారిన రోజా కొన్నాళ్లుగా ఏపీ రాజకీయ అంశాలకు దూరంగా ఉన్నారు. అటు తమిళనాడులో అవకాశం లేదని తేలిపోవడంతోనే ఇప్పుడు ఏపీకి వచ్చి మళ్లీ తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. ఇప్పటికే నగరిలో రోజా ఆస్తులను విక్రయించేస్తున్నారని.. ఆమెను నగరి వైసీపీ ఇన్‌చార్జిగా తప్పించవచ్చనే ఊహాగానాల నడుమ మళ్లీ పార్టీకి దగ్గరయ్యేందుకు ప్రభుత్వంపై విమర్శలకు దిగారని అంటున్నారు. మొత్తానికి 80 రోజుల తర్వాత రోజా మౌనవ్రతాన్ని వీడినా… ప్రత్యర్థుల విమర్శల దాడి తగ్గకపోవడమే హాట్‌టాపిక్‌గా మారింది.

Read More అనాధ పిల్లల చదువుకు వైష్ణవి ఆర్థిక సహాయం

Latest News

ప్రపంచం కమ్యూనిస్టుల వైపు చూస్తున్నది...  ప్రపంచం కమ్యూనిస్టుల వైపు చూస్తున్నది... 
నేడు ప్రపంచ దేశాలలో తమ ఆయుధ  వ్యాపారి కరణ లక్ష్యంతో యుద్ధాలు సృష్టిస్తున్న అమెరికా ఒకవైపు అయితే చిన్న చిన్న మధ్యతరహా దేశాలన్నీ చైనా వైపు మగ్గుచూపుతున్నాయని...
రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు  కలెక్టర్
ఈనెల 25న జరిగే రవీంద్ర భారతిలో బీసీల సమరభేరిని విజయవంతం చేయండి
భగవాన్ సత్యసాయి పుట్టినరోజు మహిళా వృద్ధుల ఆశ్రమ నిర్మాణమునకు రు. 50,116 విరాళం 
ఘనంగా మాజీ ఎమ్మెల్యే శ్రీ రామావత్ రవీంద్ర కుమార్ దేవరకొండ పుట్టినరోజు వేడుకలు
తెలంగాణ భవన్లో ఘనంగా దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ జన్మదిన వేడుకలు